పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దూరమయ్యాడు. ఐనా దేవుడు కరుణగలవాడు కనుక నరుడ్డి మళ్ళా తన చెంతకు తీసికొని రావడానికి తన కుమారుడ్డి పంపాడు. ఆ కుమారుడు నరుడై జన్మించి మనలను రక్షించాడు. ఆనరావతారాన్ని ఇప్పడు మన మధ్యలో కొనసాగించేదే జ్ఞానస్నానం. కనుక జ్ఞానస్నానం ద్వారా నరుడు భగవంతుని ప్రేమరహస్యాన్నీ అతని రక్షణ ప్రణాళికనీ అనుభవానికి తెచ్చుకొంటాడు.

భగవంతుడు ప్రేమతోనరుణ్ణి సృజించడానికి, పతనమైన నరుడ్డి రక్షించడానికీ ప్రణాళిక వేసాడు. మనం జ్ఞానస్నానం పొందినపుడు ఈ ప్రేమ ప్రణాళికను అనుభవానికి తెచ్చుకొంటాం. ఆ ప్రభువుని అంగీకరించి ప్రేమించి అతనితో ఐక్యమౌతాం, అతనికి ప్రార్థన లర్పిస్తాం.

జ్ఞానస్నానమంటే పిచాచంతో పోరాడ్డం, ఈలోకనాయకుణ్ణి ఎదిరించడం - యోహా 12,31. క్రీస్తు ఈ పిశాచాన్ని జయించినా ఈ లోకంలో మనకు అతనితో పోరాటం తప్పదు. కనుక జ్ఞానస్నాన సయయంలో పిశాచవిముక్తికి ప్రార్థనలు జరుగుతాయి. రక్షణదాయకమైన పరిశుద్ధ తైలంతో అభ్యంగనం జరుగుతుంది. పిశాచ పరిత్యాగ ప్రమాణం జరుగుతుంది. భక్తులు పిశాచ యజమానుణ్ణి విడనాడి క్రీస్తు యజమానుణ్ణి సేవిస్తామని ప్రమాణం చేస్తారు.

జ్ఞానస్నానం పొందడమంటే క్రైస్తవ సమాజంలో చేరిపోవడం. క్రొత్తగా జ్ఞానస్నానం పొందబోయేవాళ్ళకొరకు స్థానిక క్రైస్తవులంతా ప్రార్థన లర్పిస్తారు. వాళ్ళ అనుమతిని సలహానూస్వీకరించిన పిదపనేగాని గురువు నూత్న అభ్యర్థులకు జ్ఞానస్నాన మీయరు. ఈ సంస్కారాన్ని పొందిన పిదప నూత్న అభ్యర్థుల పాతక్రైస్తవులతోకలసి దివ్యారాధనంలో పాల్గొంటారు. తాము గూడ ఆరాధనా సమాజంలో సభ్యులౌతారు. ఇవి జ్ఞానస్నాన ప్రారంభంలో పితృపాదులు బోధించే భావాలు.

2. సూచన బోధలు

నూత్నవేదంలోని జ్ఞానస్నానాన్నిగూర్చి పూర్వవేదంలో చాల సూచనలున్నాయి. పితృపాదులు ఈ సూచనలను విపులంగా వివరించారు. ప్రస్తుతానికి వాళ్ళ సూచన బోధల్లో ఓ పదింటిని మాత్రం పేర్కొందాం.

1. జలం కడిగి శుద్ధిచేస్తుంది, రోగాన్ని కుదుర్చుతుంది.

నీటితో మనదేహాలను కడుగుకొని మాలిన్యం తొలగించుకొంటాం. అలాగే హృదయ మాలిన్యాన్ని కడిగివేసే జలంకూడ ఒకటుందనీ, జనులు ఈ జలం కొరకు ఉవ్విళ్లురాలనీ బోధించారు ప్రవక్తలు. “ఆరోజుల్లో దావీదు కుటుంబంవాళూ యెరూషలేము