పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవాన్నీ నిలబెట్టుకోగలిగి వండాలి. అసలు జ్ఞానస్నానానికి "వెలుగు" అనే పేరుకూడ వుంది. కనుక ఈ సంస్కారాన్ని పొందిన మనం జ్యోతిర్మయ మానవులంగా మెలగాలి కాని తమోమయ మానవులంగా మెలగ కూడదు.

5. పెద్దవాళ్లు జ్ఞానస్నానం పొందేపుడు ఆ పవిత్ర సంస్కారానికి జాగ్రత్తగా సిద్ధం కావాలి. యెరూషలేము సిరిల్ భక్తుడు ఈలా వాకొన్నాడు. "పెండ్లి చేసుకొనేవాడు ఉత్సాహంతో వివాహానికి అన్నీ సిద్ధం చేసికొంటాడు గదా! జ్ఞానస్నానంలో మన ఆత్మ దేవుణ్ణి వరుణ్ణిగా స్వీకరించి ఆ ప్రభువుని పెండ్లియాడుతుంది. కనుక నరులు ప్రాపంచిక చింతలుమాని ఈ పుణ్యకార్యానికి చక్కగా సంసిద్ధం కావాలి. పాపకార్యాలనూ పాపపు మాటలనూ పరిత్యజించి స్వర్గంలో సింహాసనాసీనుడై యున్న లోకాధిపతినీ, ఆయన కుడిప్రక్కనవున్న కుమారుజ్జీ, ఆయన చెంతవున్న ఆత్మనీ ధ్యానించుకోవాలి".

౩. జ్ఞానస్నానమూ పితృపాదుల సూచన బోధలు

ఆగస్టీను, ఆంబ్రోసు, జెరోము, క్రిసోస్తం, సిరిల్, గ్రెగోరీ, ఏప్రేము మొదలైన వాళ్ళకు పితృపాదులని పేరు. వీళ్ళంతా 2-6 శతాబ్దాల మధ్యకాలంలో జీవించినవాళ్ళ వీళ్ళల్లో అధిక సంఖ్యాకులుపీఠాధిపతులు, అర్చ్యశిష్ణులు కూడ. వీళ్ళు బైబులుమీద వ్యాఖ్యచెప్పి ఆనాటి క్రైస్తవ ప్రజలకు బోధ చేసారు. దీనికే పారంపర్యబోధ అని పేరు. మనకు బైబులు ఎంత ప్రమాణమో ఈ పితృపాదుల పారంపర్యబోధ కూడ అంత ప్రమాణ. జ్ఞానస్నానాన్ని గూర్చి బోధించేపుడు పితృపాదులు పూర్వనూత్నవేదాలబోధలను సమన్వయం చేస్తూ చాలా సంగతులు చెప్పారు. వీటికే సూచన బోధలు (Typology) అని పేరు. ఉదాహరణకు పూర్వవేదంలోని జలప్రళయంలో నోవావోడ ఎన్మిదిమంది భక్తులను రక్షించింది. ఈ వోడ నూత్నవేదంలోని జ్ఞానస్నానానికి సూచనంగా వుంటుంది. ఇక్కడ పూర్వవేదంలోని నోవా వోడ సూచన వస్తువు. నూతవేదపు జ్ఞానస్నానం ఆ వోడ ద్వారా సూచింపబడిన వస్తువు-1 పేత్రు 3,20-21. ఈ యధ్యాయంలో ఈలాంటి సూచన బోధలను కొన్నిటిని పరిశీలిద్దాం. ఇక్కడ రెండంశాలను విచారిద్దాం.

1. జ్ఞానస్నానం ద్వారా రక్షణ ప్రణాళికను అనుభవానికి తెచ్చుకొంటాం

భగవంతుడు ప్రేమతో ఈ ప్రపంచాన్ని సృజించాడు. దేవుడు అనురాగంతో నరుణ్ణి కలిగింపగా ఆ నరుడు పాపంచేసి దేవుని ప్రేమను ధిక్కరించాడు. ఆ దేవునికి