పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. జ్ఞానస్నానమూ బైబులు బోధలూ

నూత్నవేదంలోని ముఖ్య భావాల్లో జ్ఞానస్నానం కూడ ఒకటి. తొలి మూడు సువిశేషాలు వ్రాసిన రచయితలూ, పౌలూ యోహానూ - ఒక్కొక్కరూ ఒకొక్కక్క పద్ధతిలో జ్ఞానస్నానాన్ని గూర్చి వ్రాసారు. ఇక్కడ మనం నాలుగంశాలను పరిశీలిద్దాం.

1. మొదటి మూడు సువిశేషాల రచయితల భావాలు

ప్రస్తుతానికి క్రీస్తు యోర్గాను నదిలో స్నాపక యోహాను నుండి జ్ఞానస్నానం పొందడాన్ని గూర్చి మాత్రం విచారిద్దాం -మత్త 3,13-17. క్రీస్తుకి సొంత పాపాలేమీ లేవు. కాని అతడు మన పాపాలను భరించిన బాధామయ సేవకుడు - యెష53,5-6. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికే అతడు యోహానునుండి జ్ఞానస్నానం పొందాడు. ఈ యోహాను జ్ఞానస్నానం నేటి మన జ్ఞానస్నానంలాగ పాప క్షమను దయచేయదు. కేవలం దాన్ని సూచిస్తుంది. కనుక అది రాబోయే నూత్నవేద జ్ఞానస్నానానికి చిహ్నంగా వుంటుంది - మత్త 3,11.

క్రీస్తు జ్ఞానస్నానాన్ని స్వీకరిస్తూండగా తండ్రి ఆయన్ని గూర్చి "నీవు నా ప్రియకుమారుడివి" అని సాక్ష్యం పలికాడు. ఇది పూర్వవేదంలో యెషయా బాధామయ సేవకుణ్ణి గూర్చి చెప్పిన వాక్యం - 42,1. పూర్వవేదంలో ఒక మహాసేవకుడు దేవుని చిత్తాన్ని పాటించి ప్రాణత్యాగం చేస్తాడు. అతడు రాబోయే క్రీస్తుని సూచిస్తాడు. క్రీస్తు సిలువమరణం ద్వారా తండ్రికి ప్రియపడతాడు. ఆ కుమారుని లోనికి జ్ఞానస్నానం పొందిన మనంకూడ తండ్రికి దత్తపుత్రులమై అతనికి ప్రీతిపాత్రుల మౌతాం - గల 4,6.

పైరీతిగా తండ్రి క్రీస్తుకి సాక్ష్యం పలుకుతూండగానే ఆకాశం తెరచుకొని ఆత్మ పావురం రూపంలో దిగివచ్చింది. ఈ సంఘటనం, తర్వాత ఆత్మ శిష్యులమీదికి దిగిరావడాన్ని సూచిస్తుంది. ఆలా దిగిరావడమే శిష్యుల జ్ఞానస్నానమౌతుంది - అచ 1,5 నీటిద్వారాను, ఆత్మద్వారాను పాపపరిహారం జరుగుతుందనే సత్యం ఈ యోర్గాను జజ్ఞానస్నాన సంఘటనం నిరూపిస్తుంది.

ఇంకోవిషయంగూడ. క్రీస్తు యోర్దాను జ్ఞానస్నానం అతడు భవిష్యత్తులో పొందబోయే మరో జ్ఞానస్నానానికి చిహ్నంగా వుంటుంది. ప్రభువు "నేను పొందవలసిన జ్ఞానస్నానం మరొకటుంది. దాన్ని పొందినదాకా నాక సంతృప్తి లేదు" అని వాకొన్నాడు - లూకా 12, 50. ఈ జ్ఞానస్నానం అతని సిలువ మరణమే. యెషయా ప్రవక్త తన ప్రవచనం 42, 1లో పేర్కొన్న బాధామయ సేవకునిలాగే క్రీస్తుకూడ ప్రజల తరపున ప్రాణాలర్పించాలి. అతడు బాధల్లో మునిగి తేలాలి. కనుక క్రీస్తు జ్ఞానస్నానం అతని