పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాపాల కొరకుగాదు, మన పాపాలకొరకు. ఆయన లోకం పాపాలను భరించే దేవుని గొర్రెపిల్ల - యోహా 129.

క్రీస్తు యోర్దాను జ్ఞానస్నానం ఆయన సిలువ మరణాన్నిసూచిస్తుందని చెప్పాం. ఈ మరణం ద్వారా ఆయన ఉత్దానం చెంది ఆత్మను పొందుతాడు. తర్వాత ఆయన తన్ను విశ్వసించి తనలోనికి జ్ఞానస్నానం పొందేవాళ్ళకు ఈ యాత్మను దయచేస్తాడు - 1కొరి 15,45. మనం ఆయన మరణికోత్దానాల్లోనికి జ్ఞానస్నానం పొంది ఆయన ఆత్మను స్వీకరిస్తాం.

యోహాను తన జ్ఞానస్నానం తన తర్వాత వచ్చే మెస్సియా జ్ఞానస్నానాన్ని సూచిస్తుందని వాకొన్నాడు. ఇదే నూత్నవేద జ్ఞానస్నానం. ఇది పరిశుద్దాత్మతోను అగ్నితోను ఈయబడేది - మత్త 3,11. ఇక్కడ అగ్ని అంటే ఏమిటి? అగ్నిదేవుని ప్రేమకు గుర్తు. ఆ ప్రేమే పవిత్రాత్మ - అచ 2, 3, హెబ్రే 12,29. కనుక నూత్నవేద జ్ఞానస్నానం దేవునిప్రేమ శక్తియైన పరిశుద్ధాత్మతో ఈయబడేదని భావం.

పై యోర్గాను సంఘటనంతో సంబంధం లేనిదైనా, సువిశేషాల్లో జ్ఞానస్నానాన్ని గూర్చిన మరో ముఖ్యవాక్యం వుంది. అదే క్రీస్తు అంతిమ ఆజ్ఞ. ఉత్తాన క్రీస్తు "మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా జేయండి, పిత పత్ర పవిత్రాత్మల నామంలోనికి వాళ్ళకు జ్ఞానస్నానమీయండి" అని శిష్యులకు ఆదేశించాడు. ఇక్కడ జ్ఞానస్నానం పొందేవాళ్ళు త్రీత్వంలోనికి దాన్ని పొందుతారని భావం. ముగ్గురు దైవవ్యక్తుల నామంలోనికి జ్ఞానస్నానం పొందడమంటే ఆ దైవ వ్యక్తులకు అంకితం కావడం. ఆ ముగ్గురు వ్యక్తుల కుటుంబంలోనికి ప్రవేశించడం. ఆ కుటుంబానికి దత్తపుత్రులం కావడం. కనుక దైవకుటుంబంలోనికి జ్ఞానస్నానం పొందేవాళ్ళ ఆ దైవకుటుంబం జీవించే దివ్యజీవనాన్నే జీవిస్తారు.

2. పౌలు భావాలు

పౌలు జ్ఞానస్నానాన్ని గూర్చి చాల సంగతులు చెప్పాడు. ఈ భావాలు విశేషంగా రోమీయుల జాబులోను గలతీయుల జాబులోను కన్పిస్తాయి. ప్రస్తుతానికి స్నానం క్రొత్తపట్టువు, పాతిపెట్టడం, ధరించడం, దాటడం, సున్నతి, ముద్ర, వెలుగు అనే భావాలను మాత్రం పరిశీలిద్దాం.

1. "బాప్టిట్టేయిన్" అనే గ్రీకు క్రియకు ముంచడం, కడగడం, స్నానమాడ్డం అనే అర్ధాలున్నాయి. కనుకనే పౌలు ఈ క్రియ ఓ స్నానం లాంటిదని చెప్పాడు - తీతు 3,5. అపోస్తలుల చర్యలు 22, 16 ఈ క్రియ మన హృదయాన్నే కడిగివేస్తుందని చెప్తుంది.

2. ఈ స్నానం ద్వారా మనకు క్రొత్తపుట్టువు లభిస్తుంది - తీతు 3,5. ఇది కేవలం వ్యక్తులకు మాత్రమేగాక శ్రీసభ కంతటికీ సిద్ధిస్తుంది - ఎఫె 5,26.