పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన్నించే శక్తిని దయచేసాడు - యోహా 20,22-23. కనుక ఆత్మద్వారానే పాపపరిహారం జరుగుతుంది. నేడు తిరుసభ ఈ పాపపరిహారాన్ని ప్రకటిస్తుంది — లూకా 24,47. నరులు క్రీస్తుని అంగీకరించి దేవునితో సఖ్యపడాలి అని నలుమూలలా బోధిస్తుంది - 2కొ 5,19. ఈ పనంతా ఆత్మద్వారానే జరుగుతుంది.

5. గురుపట్టం పొందినవారిని ప్రాచీన శ్రీసభ "పెద్దలు" అని పిల్చింది. పవిత్రాత్మద్వారా తిరుసభలోని మంద ఈ పెద్దలకు అప్పగింపబడింది - అచ. 20,28. తిమోతి పౌలు హస్తనిక్షేపణం వల్లనే దేవుని వరమైన ఆత్మను పొందాడు -2తిమో 1,6. అనగా అతనికి ఆత్మద్వారానే గురుపట్టం సిద్ధించింది. క్రీస్తులాగే అతని శిష్యులుకూడ దేవునికి నివేదితులు - యోహా 17,19. ఈలా నివేదితులైన తర్వాత వాళ్ళ ప్రజలను పవిత్రులను చేస్తారు. గురువు కూడ పవిత్రాత్మద్వారా ప్రజలను దేవునికి నివేదిస్తాడు - రోమా 15-16. కనుక ఆత్మద్వారానే గురుపట్ట సంస్కారం ఫలప్రదమౌతుంది.

6. అన్ని సంస్కారాల్లా కాకుండ, జ్ఞానవివాహ సంస్కారాన్ని వధూవరులే ఒకరికొకరు ఇచ్చుకొంటారు. మన వివాహం క్రీస్తు శ్రీసభతో ఐక్యంకావడానికి గుర్తుగా వుంటుంది - ఎఫె 5,32. వివాహం వధూవరుల మధ్య ఓ నిబంధనం లాంటిది. వివాహసంస్కారం ద్వారా భార్యాభర్తలను ఐక్యంజేసేది పవిత్రాత్మే వధూవరులు పరస్పర ప్రేమతో ఒకరితో నొకరు ఐక్యంగావడం ఈ సంస్కారం యొక్క ప్రయోజనం - ఎఫె 5,31. ఈ యైక్యతవల్లనే వాళ్ళ నూత్నకుటుంబాన్ని నెలకొల్పుతారు. ఈ యైక్యతను ప్రసాదించేది పవిత్రా.
7. కడపటిది అవస్థాభ్యంగం. ఆత్మ స్వయంగా అభ్యంగనమే. క్రీస్తు ఆత్మచే అభిషిక్తుడయ్యాడు - అచ 10,38. అతనిలోనికి ఐక్యమయ్యేవాళ్ళనుగూడ ఆత్మ అభిషేకిస్తుంది. అవస్థాభ్యంగన అభిషేకంద్వారా వ్యాధిగ్రస్తులకూ ఆరోగ్యమూ, ఊరటా, పాపపరిహారమూ లభిస్తాయి. ఆత్మ అభ్యంగనాన్ని పొందిన రోగి  వసించి అతనికి ఉపశాంతిని దయచేస్తుంది. ఆ రోగి పాపాలను మన్నించి అతన్ని పవిత్రుని చేస్తుంది. మందు మన దేహం మీద పనిచేస్తుంది. కాని అవస్థాభ్యంగనం ప్రత్యక్షంగా మన ఆత్మమీద పనిచేస్తుంది. పరోక్షంగా మాత్రమే అది మన దేహంమీద పనిచేస్తుంది. వ్యాధిగ్రస్తునికి పెద్దలచే తైలాన్ని పూయించాలి అనే యాకోబు వాక్యం ఈ సంస్కారాన్నే పేర్కొంటుంది - యాకో 5,14-15. ఈరీతిగా ఏడు సంస్కారాల్లోను ఆత్మ పనిచేస్తుంది.