పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్ధనా భావాలు

1. గురుపట్ట సంస్కారాన్నిచ్చేది పవిత్రాత్మే పీఠాధిపతి అభ్యర్థిపై చేతులుచాచి ఈలా ప్రార్ధిస్తారు. "సర్వశక్తిగల పితా! ఈ సేవకునికి గురుత్వపు ఘనతను ప్రసాదించండి. ఇతని హృదయంలో పవిత్రాత్మ శక్తిని నూతీకరించండి. దీనివలన ఇతడు మీనుండి ఆచార్యత్వంలో రెండవ అంతస్తును పొందునుగాక. నిగ్రహజీవితాన్ని అలవర్చుకొని తన సత్ర్పవర్తనం వలన అందరికీ ఆదర్శంగా వుండునుగాక." ఈ హస్తనిక్షేపణం ద్వారాను, ఈ ప్రార్ధనం ద్వారాను సామాన్య మానవుడు ఆత్మనుపొంది గురువుగా మారిపోతాడు.

2. పరలోక జపం "మీ రాజ్యం వచ్చునుగాక" అనే వాక్యం వస్తుంది. కాని ఈ వాక్యానికి బదులుగా ప్రాచీన పితృపాదులు చాలమంది “నీ పవిత్రాత్మ మాపై దిగివచ్చి మమ్ము శుద్ధిచేయునుగాక" అనే వాక్యాన్ని గ్రహించారు. అనగా ఆత్మ మనలను పవిత్రపరచి మనకు మోక్షభాగ్యాన్ని దయచేస్తుందని భావం.

22. నైతిక జీవితం గడిపేలా చేసే ఆత్మ

1. భక్తులు నైతిక జీవితం గడిపేలా చేసేది ఆత్మే పూర్వవేదకాలానికి ధర్మశాస్త్రమున్నట్లే నూత్న వేదకాలానికి క్రీస్తు కట్టడలున్నాయి. కాని ఈ కట్టడలన్నిటికీ కర్త ఆత్మడే అందుచే అతడే నూత్న వేదకాలానికి ప్రధాన నియమం అని చెప్పాలి. మనం ఆత్మవలన జీవించేవాళ్ళం గనుక ఆత్మకు వశవర్తులమై నడచుకోవాలి - గల 5,25.

పూర్వవేదకాలంలో ధర్మశాస్త్రం రాతిపలకలపై రాయబడింది. అది నరుల అంతరంగంలోగాక వారి హృదయాలకు వెలుపల వుంది. దాన్ని పాటించే శక్తిగూడ పూర్వవేద నరులకు లేదు. కనుకనే యూదులు తరచుగా ధర్మశాస్తాన్ని మీరుతూ వచ్చారు. కాని నూత్నవేదపు ధర్మశాస్త్రం మన హృదయాల్లోనే లిఖింపబడింది. దాన్ని పాటించే శక్తిగూడ మనకుంది. కనుకనే యిర్మీయా ప్రవచనం ఈలా చెప్తుంది. "ఆ దినం వచ్చినపుడు నేను యిస్రాయేలు ప్రజలతో చేసికొనే నిబంధనం ఇది. నేను నా ధర్మశాస్తాన్ని వారి అంతరంగంలో వుంచుతాను. వారి హృదయాలపై లిఖిస్తాను" - 31,33. పై ప్రవక్త చెప్పినట్లుగా ధర్మశాస్తాన్ని ఈలా మన అంతరంగంలో వుంచేది పవిత్రాత్మే "ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలచివుంది" -1యోహా 2,27. ఈ వాక్యం ప్రకారం మనలను ఆంతరంగికంగా అభిషేకించేవాడు పవిత్రాత్ముడే దైవవాక్కు ద్వారా