పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పవిత్ర జీవితానికి లేస్తాం. ఈ జ్ఞానస్నానం ద్వారా ఆత్మ మనలను క్రీస్తు శరీరమైన శ్రీసభలోనికి చేరుస్తుంది. మనమందరం ఒకే ఆత్మయందు ఒకే శరీరంగా జ్ఞానస్నానం పొందాం - 1కొ 12,13.

2. జ్ఞానస్నానంలాగే భద్రమైన అభ్యంగనం గూడ ఆత్మనూ వరప్రసాదాన్నీ దయచేస్తుంది. కాని రెండింటికి తేడా వుంది. జ్ఞానస్నానం చిన్నపిల్లలకు. అది మనలను క్రీస్తుతో ఐక్యం చేస్తుంది. భద్రమైన అభ్యంగనం పెద్దవాళ్ళకు. అది మనలను శ్రీసభతో ఐక్యం జేస్తుంది. ఈ సంస్కారంద్వారా మనం శ్రీసభకు, అనగా తోడివారికి సేవలు చేస్తాం. క్రీస్తుకి సాక్ష్యంగా వుంటాం. అతన్ని ఇతరులకు బోధిస్తాం. ఇతరుల హృదయాల్లోకూడ విశ్వాసరూపంలో క్రీస్తు జన్మించేలా చేస్తాం - గల 4,19. లోకంలో మన విశ్వాసాన్నిధైర్యంగా ప్రకటిస్తాం, ఈ కార్యాలన్నీ ఆత్మద్వారా జరుగుతాయి. సమరయ ప్రజలు స్వీకరించింది ఈ భద్రమైన అభ్యంగనాన్నే - అచ 8,14-17.

3. నడిపూజలో పీఠంమీది అప్పరసాలను క్రీస్తు శరీరరకాలుగా మార్చేది పవిత్రాత్మే. కనుకనే పూజలో “మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బతిమాలు కొనుచున్నాము" అని దేవునికి ప్రార్థన చేస్తాం, ఆత్మ క్రీస్తు మరణోత్థానాలను అప్పరసాల్లోనికి ప్రవేశపెట్టి వాటిని దివ్య వస్తువులనుగా మారుస్తుంది. పూర్వవేదంలో దేవుని వాక్కూ శ్వాసా రెండూ వున్నాయి. ఈ వాక్కు క్రీస్తు, ఈ శ్వాస ఆత్మ ప్రతి సంస్కారంలోను క్రీస్తు, ఆత్మ ఇద్దరు కలసే పనిచేస్తారు. క్రీస్తు రొట్టె నుద్దేశించే "ఇది నా శరీరం" అని చెప్పాడు. కాని ఆ రొట్టెను ప్రస్తుతః క్రీస్తు శరీరంగా మార్చేది మాత్రం ఆత్మే క్రీస్తు శరీరంనుండి నీరూ నెత్తురూ స్రవించినప్పడు దివ్యసత్రసాదం పుట్టింది - యోహా 19,34. అది ఆత్మవల్లనే తయారైంది. కనుక ఆత్మసాన్నిధ్యంతో నిండివుంటుంది. ఈనాడు జీవంకొరకు మనం ఈ రొట్టెనూ ఈ పానీయాన్నీస్వీకరిస్తాం - యోహా 6,53-54. శ్రీసభలో దీనికంటె శక్తిమంతమైన సంస్కారం మరొకటి లేదు.

4. కేవలం కొన్ని ఆజ్ఞలనూ పుణ్యాలనూ పాటించినంత మాత్రాన్నే నరుడు పవిత్రుడు కాడు. క్రీస్తుని విశ్వసించి పవిత్రాత్మను పొందడం ద్వారా అతడు పవిత్రుడౌతాడు. పవిత్రాత్మ లేనివాడెల్ల పాపాత్ముడే నరులందరు పాపంచేసి దేవుని మహిమను (ఆత్మను) కోల్పోయారు - రోమా 3,23. నరుడు తన పాపాలకు పశ్చాత్తాపపడితే దేవుడు అతనికి తన ఆత్మను అనుగ్రహించి అతని పాపాలు మన్నిస్తాడు. అసలు ఆత్మేమనకు పాపపరిహార మౌతుంది. ఉత్తాన క్రీస్తు శిష్యులమీదికి శ్వాసను (ఆత్మను) వూది వారికి పాపాలను