పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆత్మ వేదగ్రంథ వాక్యం మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఆ వాక్కు మన హృదయంలో సజీవంగా నెలకొనేలా చేస్తుంది - హెబ్రే 4,12. కనుక ఎప్పుడుగూడ మనం ఆత్మ సహాయంతోగాని వేదగ్రంథాన్ని పఠించగూడదు. ఆత్మ తోడ్పాటుతో వేదగ్రంధాన్ని చదివితే దానిలో తప్పక క్రీస్తుని కలసికొంటాం, దివ్యగ్రంథ పఠన ప్రయోజనం ఇదే.

మనం బైబులు చదువుకొనేపుడు ఆత్మ మన ముఖం మీది ముసుగును తొలగిస్తుంది. అప్పుడు క్రీస్తు జ్యోతి మనమీద ప్రసరిస్తుంది - 2కొ 3,17-18. మనం వేద గ్రంథంలోని వాక్యంలో క్రీస్తు స్వరాన్ని స్పష్టంగా గుర్తిస్తాం.

ప్రార్థనా భావాలు

1. సిరియా సీమోను భక్తుడు ఈలా నుడివాడు. “తండ్రి విశ్వాసగృహంలాంటివాడు. క్రీస్తు ఆ గృహానికి తలుపులాంటివాడు. ఆత్మడు ఆ తలుపుకి తాళపు చెవిలాంటివాడు." ఆత్మ గొప్ప వెలుగు. ఆ వెలుగునుపొంది మనం వేదసత్యాలను గ్రహిస్తాం. దేవుణ్ణి విశ్వసిస్తాం.

2. ఇరెనేయస్ భక్తుడు ఈలా చెప్పాడు. తండ్రికి వాక్కూ శ్వాసా రెండూ ఉన్నాయి. ఆ వాక్కే క్రీస్తు ఆ శ్వాసే పవిత్రాత్మ ఇవి రెండూ దేవునికి రెండు చేతుల్లాంటివి. ఈ రెండిటిద్వారా అతడు ఆదిమానవుడైన ఆదామని చేసాడు. అతన్ని తనకు పోలికగాగూడ చేసాడు. ఈ రెండిటిద్వారానే అతడు మళ్ళా శ్రీసభనుగూడ చేసాడు.

21. సంస్కారాల్లో పనిచేసే ఆత్మ

1. ఆత్మ క్రియాశక్తివల్లనే శ్రీసభ ఏర్పడింది, ఈ శ్రీసభలోని ఏడు సంస్కారాలూ ఆత్మవరప్రసాద బలం వల్లనే ఫలసిద్ధిని పొందుతాయి. ఇక్కడ ఈ యేడింటినీ క్రమంగా పరిశీలిద్దాం.

పూర్వవేదం ఆత్మకు నీటిని సంకేతంగా వాడింది. ఈ సంకేతానికి తగినట్లుగానే నూత్నవేదంలో ఆత్మ క్రీస్తు ప్రక్కలోనుండి నీరులాగా ప్రవహించింది - యోహా 19,34. ఈ నీరు ఆత్మ జ్ఞానస్నానం, వరప్రసాదం మొదలైన వాటికన్నిటికి చిహ్నంగా వుంటుంది. మనం నీటివలన ఆత్మ వలనా ఆధ్యాత్మికంగా జన్మిస్తాం - 3,5. క్రీస్తు మరణోత్తానాల్లోకి జ్ఞానస్నానం పొందుతాం - రోమా 6,3-5. క్రీస్తు మరణంలోకి జ్ఞానస్నానం పొంది అతనితోపాటు పాపానికి చనిపోతాం. క్రీస్తు ఉత్థానంలోకి జ్ఞానస్నానం పొంది అతనితోపాటు