పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేస్తాడు అన్నాడు యెషయా - 54,12. నూత్నవేదంలో పవిత్రాత్మే మనకు అభిషేకం చేస్తుంది – 1యోహా 2,20. అనగా ఆత్మ మన హృదయాల్లో విశ్వాసం పుట్టించి మనం వేదసత్యాలను గ్రహించేలాను వాటిని ఇతరులకుగూడ తెలియజేసేలాను చేస్తుంది.

బైబులు గ్రంథ రచనతో దివ్యశ్రుతి ముగిసింది. కనుక ఇప్పుడు మనం క్రొత్త వేదసత్యాలేమీ నేర్చుకోము. కాని ఆత్మప్రేరణంతో ప్రాత వేదసత్యాలనే మరింత లోతుగా గ్రహిస్తాం. ఆ వేదసత్యాలనుండి పురాతన విషయాలనూ నూత్న విషయాలనూ నేర్చుకుంటాం - మత్త 13,52.
2. ప్రవచన వరాన్ని దయచేసేది ఆత్మే ఆ వరంలో ముఖ్యమైన అంశం వేదగ్రంథ రచన. ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రేరితులై దేవుని సందేశాన్ని విన్పించారు - 2షేత్రు 1,21. ఆత్మ క్రీస్తుని మహిమపరుస్తుంది. ఏలా? వేదగ్రంథాలను వ్రాయించడంద్వారా, వాటిని ప్రకటింపజేయడంద్వారా. నూత్నవేదగ్రంథాలు తెరువబడిన క్రీస్తు హృదయంనుండి ఆత్మ ప్రేరణంవల్ల పుట్టాయి.
మనం మామూలుగా తిరుసభ, దివ్యసత్ర్పసాదం క్ర్రీస్తు శరీరమని చెప్తాం. కాని దివ్యగ్రంథాలుకూడ క్రీస్తు శరీరమని చెప్పాలి. వాటిల్లోగూడ ఆత్మశక్తివల్ల క్రీస్తు సాన్నిధ్యం నెలకొని వుంటుంది. కనుక మనం వేదగ్రంథాన్ని పఠించేపుడు క్రీస్తే మనతో మాటలాడుతుంటాడు. అగస్టీను భక్తుడు చెప్పినట్లుగా, సువిశేషం క్రీస్తు నోరు. పవిత్రగ్రంథంద్వారా ఆత్మ దేవుని సందేశాన్ని విన్పిస్తుంది.
3. ప్రవచనవరం పూర్వం వేదగ్రంథ రచయితల్లో కన్పించింది. ఈనాడది వేదగ్రంథ పఠితల్లో కన్పిస్తుంది. ఈ వరంద్వారా మనం పవిత్రగ్రంథాన్ని అర్థం జేసికొంటాం. దాన్ని ఇతరులకుగూడ బోధిస్తాం. ఈ బోధయెప్పడూ ఆత్మశక్తివల్లనే జరుగుతుంది - 1కొ 12,3. పూర్వవేదంలో ప్రవచనవరం చివరి ప్రవక్తమైన మలాకీతో ఆగిపోలేదు. ఆ వరం తర్వాత రబ్బయిలలో కొనసాగింది. దీని బలంతోనే రబ్బయిలు పూర్వవేదంమీద వ్యాఖ్యలు చెప్పారు. నూత్నవేదంలోగూడ వేదబోధ చేసే వాళ్ళందరికీ ఈ వరం కొదోగొప్పో వుంటుంది. దేవుణ్ణి నిరాకరించే ఆధునిక ప్రపంచంలో మనం ఈ వరాన్ని వినియోగించుకొని మరీ అధికంగా వేదబోధ చేయాలి.
వేద గ్రంథాలను చదివి అర్థంజేసికోడానికి ఆత్మ సహాయం అత్యవసరం, పవిత్ర గ్రంథంలోని ప్రవచనానికి ఎవరి యిష్టం వచ్చినట్లుగా వాళ్లు అర్థం చెప్పకూడదు -  2షేత్రు 1,20. ఆత్మ మనకు ఆ గ్రంథ భావాన్నితెలియజేయాలి. ఆ యాత్మ సహాయంతోనే దాన్ని మనం ఇతరులకు బోధించాలి.