పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహ ధర్మాలు. కనుక కృత్రిమంగా సంతానాన్ని అరికట్టడం వివాహ ధర్మాన్ని విూరడమే ఔతుంది. ఈ పట్టన తోబియా వాక్యాలు మనకు ఆదర్శం కావాలి. అతడు సారాను కూడబోయేపుడు ఈలా ప్రార్థన చేసాడు -

"ప్రభూ! నీవు ఆదామని సృజించావు
అతినికి భార్యగాను ఆదురువుగాను
తోడునీడగాను ఉండడానికి ఏవను చేసావు
వారినుండియే మానవజాతి ఉద్భవించింది
నేను కామతృప్తి కొరకుగాక
దైవాజ్ఞకు లొంగి ఈ సారాను స్వీకరించాను
నీవు మమ్మ కరుణతో జూడు” - తోబీ 8,6-7.

క్రైస్తవ దంపతుల లైంగిక జీవితంలో సంయమనం కూడ వుండాలి. మనం ఇహలోకం కొరకుగాక పరలోకం కొరకు ఉద్దేశింపబడినవాళ్ళం. అక్కడ వివాహంగాని బిడ్డలను కనడం గాని వుండదు. అక్కడి జీవితం దేవదూతల జీవితంలా వుంటుంది - మార్కు 12,25. మనం ఇక్కడ వున్నపుడే ఆ పరలోక జీవితానికి సిద్ధం కావాలి, కావున దంపతుల లైంగిక ప్రవృత్తిలో నిగ్రహం వుండాలి. ఈ నిగ్రహం లైంగిక క్రియ చెడ్డదని నిరూపించదు. క్రైస్తవుడు లైంగిక జీవితాన్ని దాటిపోయి ఉత్తాన జీవితంలో అడుగిడాలని నిరూపిస్తుంది, ఈ భూలోక జీవితంకంటె పరలోక జీవితం గొప్పదని నిరూపిస్తుంది. పౌలు కూడ తన లేఖల్లో ఈ సంయమనాన్ని పేర్కొన్నాడు, కాలం చివరకు వచ్చింది కనుక భార్యను కలిగినవాళ్లు కూడ భార్య లేనట్లుగా జీవించాలి అని చెప్పాడు -1కొ 7,29.

ఆ ప్రభువు రెండవ రాకడను మనసులో పెట్టుకొని అతడు ఈలా వ్రాసాడు. ఈలోక విషయాలూ, వాటితోపాటు వివాహం కూడ ప్రభువు రాకడకు తావీయాలి. ఇంకా, ప్రార్ధనం చేసికొని భగవంతుని సాక్షాత్కారం కలిగించుకోవడం కోసం భార్యాభర్తలు కొంత కాలంపాటు ఒకరి నొకరు సమిూపించకుండా వుండడం మంచిదని కూడా సూచించాడు. - 1కొ 75. కనుక లైంగిక సుఖమే పరమావధి అనుకోగూడదు.

పవిత్రతను సాధించే మార్గాలు

లైంగిక వాంఛలు అతి బలీయంగా వుంటాయి. వాటిని అణచుకొని పవిత్రతను సాధించడం కష్టమైన కార్యం. ఐనా వరప్రసాద బలంతో క్త్రెస్తవుడు ఈ పుణ్యాన్ని సాధించవచ్చు.

పవిత్ర జీవితం జీవింపగోరేవాళ్ళు తమ్ముతాము నిగ్రహించుకోగలిగి వుండాలి. సుఖాలను త్యజించ గలిగివుండాలి. దివ్యసత్ర్పసాదం, పాపసంకీర్తనం మొదలైన