పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్కారాలను భక్తితో స్వీకరించాలి. శ్రద్ధతో ప్రార్థన చేసికోవాలి. దైవబలం వలన మన శరీరం క్రమేణ ఆత్మకు లొంగుతుంది.

సుఖజీవనానికి అలవాటుపడినవాళ్ళ పవిత్రతను సాధించలేరు. తమ యిష్టం వచ్చినట్లుగా తిని త్రాగేవాళ్ళ ఎప్పడూ ఇంద్రియాలను సంతోషపెట్టుకొనేవాళ్లు, వళ్ళవంచి పనిచేయకుండ సోమరితనంగా తిరిగేవాళు శారీరక వాంఛలను జయించలేరు. భోగబ్రియలు జితేంద్రియలు కాలేరు కదా? శరీరంలోని జంతు వాంఛలను లొంగదీసుకోవాలంటే నరుడు కరోర జీవితం జీవించాలి. తపస్సును అలవాటు చేసికోవాలి. ఈ విషయంలో జాగ్రత్తకూడ అవసరం. మనకు భావనాశక్తి వుంది. ఈ శక్తితో మన మనసు పెక్కు లైంగిక భావాలను కల్పించుకొంటుంది, మనం చదివే పుస్తకాలు, చూచే సినిమాలు, టీవీలు మొదలైనవి కూడ కొంతవరక మన మనసుకి ఉసిపోస్తాయి. మన చూపులు కూడ చాల ముఖ్యం, కంటితో చూచిన దృశ్యం ఒకటి ఇవ్వాళ మనకు పాపకారణం గాకపోవచ్చు. కాని రేపు అదే శోధనలు తెచ్చిపెడుతుంది. కనుక నేత్రవినీతి అవసరం, ఈ సందర్భంలో సీరా గ్రంథం ఈలా వాకొంటుంది.

"అందగత్తె యెదురుపడినపుడు
నీ చూపులను ప్రక్కకు త్రిప్పకో
ఫ్రీసౌందర్యం వలన చాలమంది తప్పతోవ పట్టారు
 అది అగ్నిలాగ ఉద్రేకజ్వాలలను రగుల్కొల్పుతుంది" - 9,8-9.

ఇక్కడే స్పర్శను గురించి కూడ ఓ మాట చెప్పాలి. లైంగిక సుఖం విశేషంగా స్పర్శలోనే వుంటుంది. ఒకమారు ఈ స్పర్శను మేలుకొల్పితే దాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టం. కనుక విశుద్ధ హృదయులు కామ సంబంధమైన స్పర్శకు అన్నివిధాల దూరంగా వుండాలి.

కొన్నిసార్లు లైంగిక పాపాల్లో పడిపోతాం. కొన్ని పర్యాయాలు ప్రయత్నం చేసినా ఈ పాపాలనుండి తప్పించుకోలేం అనిపిస్తుంది. దీనివలన నిరుత్సాహ భావాలు కలుగుతాయి. విశేషంగా కొందరికైతే ఈ రంగంలో బలహీనత మెండు. వీళ్ళు అవివాహితులూ కావచ్చు. వివాహితులూ కూడ కావచ్చు. వీళ్ళకు ఏదో కామభూతం తమ్ము ఆవేశించినట్లుగాను, అది నిర్బంధంగా తమ్ము పాపానికి పురికొల్పుతూన్నట్లుగాను తోస్తుంది. ఐనా మనం నిరుత్సాహపడకనక్కర లేదు, మన హృదయం దేవునిపై నిల్చివుంటే చాలు ఆ ప్రభువే మనలను సకల శోధనల నుండి కాపాడతాడు. ప్రభువుకి నీతిశాస్త్రం బాగా తెలుసు. మన మనసు ఎంతవరకు పాపానికి లొంగిందో, ఎంతవరకు తనపట్లగల భక్తిభావంతో స్థిరంగా నిల్చివుందో అతనికే తెలుసు. కనుక మన మంచి చెడ్డలను ఆ దయామయునికే వదలివేయాలి. మనం మాత్రం నిరాశకు తావీయక, వరప్రసాద బలంతో ధైర్యంగా ముందుకి వెళూండాలి.