పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరజాతి ప్రాణాలను నిలబెట్టడానికి లైంగికప్రీతిని దయచేసాడు. స్త్రీ పురుషులు ఉచితరీతిలో కలసికొని సంతానాన్ని కని ఈ నేలమిూద నరజాతిని కొనసాగించుకొనిపోవాలి.

భగవంతుడు భోజనంలో రుచిని పెట్టినట్లే కలయికలో ఆనందాన్ని పెట్టాడు. రుచికి మరిగి అన్నం తింటాం, ఫలితంగా దేహపోషణం జరుగుతుంది. సుఖానికి మరిగి స్త్రీ పురుషులు కలసికొంటారు. ఫలితంగా సంతానోత్పత్తి కలిగి నరజాతి కొనసాగుతుంది.

కాని నరులు భోజనం విషయంలో చాల పాపాలు చేసినట్లే, లింగం విషయంలో గూడ చాల పాపాలు చేస్తారు. కనుక భోజనం విషయంలోలాగే లింగం విషయంలో గూడ మితత్వం అవసరం.

మనం హృదయంలోనుండి లైంగిక వాంఛలను పూర్తిగా నిర్మూలించకూడదు. వాటంతట అవి మంచివే. అవిలేందే నరజాతి కొనసాగే మార్గంలేదు. కాని మనం ఈ వాంఛలను స్వార్ధలాభానికి వాడుకొని పాపం కట్టుకొంటాం. కనుక వీటిని అదుపులో పెట్టుకోవడం అవసరం. ఇందుకుగాను పవిత్రత (Chastity) అనే పుణ్యాన్నిపాటించాలి. "మోహం” అనే అధ్యాయంలో పవిత్రతను గూర్చి కొన్ని అంశాలు చెప్పాం. అక్కడ చెప్పినవాటిని ఇక్కడ వివరిస్తున్నాం.

లైంగిక సుఖాలను అదుపులో వుంచే పుణ్యమే పవిత్రత. అవివాహితులు వివాహితులు కూడ వారివారి అంతస్తునకు తగినట్లుగా పవిత్రతను పాటించాలి. దంపతులు వివాహ జీవితంలో క్రమబద్ధమైన లైంగిక సుఖాలను అనుభవించవచ్చు. అవివాహితులకు ఈ సుఖాలు అసలు పనికిరానేరావు.

సంసార జీవితంలో స్త్రీపురుషులు తమ లైంగికావయవాలను పరస్పరం వినియాగించుకొని పరిపూర్ణ సుఖాన్ని పొందుతారు. కాని అవివాహితులకు ఈ లైంగిక క్రియ పూర్తిగా నిషిద్ధం. వాళ్ళు సంతానాన్ని కనే ప్రసక్తిలేదు. కనుక లైంగిక క్రియకూడ వాళ్ళకు తగదు, శారీరకంగాను మానసికంగాను గూడ వాళ్ళకు ఈ క్రియ నిషిద్ధం. స్వయంగా లైంగికావయవాలను స్పృశించుకొని ఉద్రేకాన్నీ ఆనందాన్నీ పొందడం గూడ పాపమే.

వివాహితులు

కాని వివాహితుల విషయం వేరు. వాళ్ళ సంతానాన్ని కని జగత్ స్థితిని కొనసాగించాలని భగవంతుని నిర్ణయం, కనుక దంపతులు కలుసుకోవాలి, సుఖాన్ని అనుభవించాలి, బిడ్డలను కనాలి. భార్యభర్తల లైంగిక క్రియలు లైంగిక సుఖాలు నానారూపాల్లో వుండవచ్చు, వాళ్ళు దంపతులు కనుక అవి యే రూపాంలోవున్నా పవిత్రమైనవే ఔతాయి. కనుక వాటికి నిషేధం ఏమిూలేదు. కాని ఆలుమగలు లైంగిక సుఖాన్ని అనుభవించి ఆ విూదట తత్ఫలితమైన సంతానాన్ని బుద్ధిపూర్వకంగానే నిషేధించకూడదు. పరస్పర ప్రేమ సంతానప్రాప్తి రెండూ