పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. సంపదలనే విగ్రహాన్ని ఆరాధించే మనస్తత్వం వీక్ష లేదా?
4.“సంపదలకు మన హృదయాన్ని వశం చేసికొనే విచిత్రమైన శక్తి వుంది" - ఈ రంగంలో నీ యనుభవం ఏమిటి?
5. సుఖభోగాలు, ధనం ఆస్తి, పదవి, కీర్తిప్రతిష్ఠలు - మొదలైన లోకవస్తువుల్లో నీ వెక్కువగా ఆశించేది వేటిని?
6.నీవు పిసినిగొట్టవాలేక నీకున్నదానిలో కొద్దోగొప్పో పేదలకు దానం చేసేవాడివా?
7.దురాశతో ఇతరులకు ముట్టవలసింది నీవు కొట్టేస్తుంటావా?
8."బుద్ధిమంతుడు పరలోకంలో సంపదలు కూడబెట్టుకోవాలి” అంటే యేమిటి?
9."పచ్చుకోవడంకంటె ఈయడం ధన్యం" - ఎందుకు?
10. పేదవాళ్ళ మార్గాంతరం లేక పేదవాళ్ళుగా వుంటున్నారు గాని వాళ్ళల్లోగూడ ఆశలు బ్రహ్మాండంగానే వుంటాయి - ఈ రంగంలో నీ యనుభవం ఏమిటి?

2. నాలు నైతిక పుణ్యాలు

ప్రాచీనకాలంనుండి క్రైస్తవ రచయితలు నాలుగు నైతిక పుణ్యాలను పేర్కొంటూ వచ్చారు, అవి వివేకం, న్యాయం, ధైర్యం, మితత్వం, ఇవికాక యితర నైతిక పుణ్యాలుకూడ వున్నాయి. కాని నైతికపుణ్యాలన్నిటికీ ఈ నాల్లే ఆధార మౌతాయి. ఇక ఈ నాల్లింటినీ క్రమంగా పరిశీలిద్దాం.

1. వివేకం

1. వివేకం అంటే ఏమిటి?

లక్ష్యాన్ని సాధించడానికి అనువైన మార్గాన్ని ఎన్నుకోవడమే వివేకం. ఉదాహరణకు దానధర్మాలు చేయాలన్నది క్రైస్తవ లక్ష్యం. కాని మనం ఎవరికి, ఎప్పడు, ఏలా, ఎంత దానంచేయాలో నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయాన్ని సరిగా చేసికొని దానం చేస్తే అది వివేకమౌతుంది. శాశ్వత గృహమైన మోక్షాన్ని చేరుకొని దేవుణ్ణి దర్శించడం మన లక్ష్యం. మోక్షాన్ని చేరుకోవడానికి తగినట్లుగా ఈ లోకంలోనే భక్తితో జీవించడానికి పూనుకొంటే అది వివేక మౌతుంది.
లౌకిక రంగంలో కూడ బోలెడంత వివేకముంటుంది. పరిశ్రమలు, వ్యాపారం, రాజకీయాలు మొదలైన వాటిల్లో వివేకంతో మెలిగి ప్రజలు డబ్బు కీర్తి మొదలైనవాటిని గడిస్తారు. ఇది లౌకిక వివేకం. దీనికి దేవునితో సంబంధం లేదు. ఉదాహరణకు సుమతీ శతకంలోని ఈ క్రింది పద్యం చూడండి.