పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ"

ఈ పద్యం కేవలం లౌకిక వివేకాన్ని బోధిస్తుంది. కాని ఇక్కడ మనం చెప్పబోయేది ఆధ్యాత్మిక వివేకం. ఇది నిరంతరం దేవునితో సంబంధం కలిగి వుంటుంది. ఈ వివేకానికి ఆదర్శం క్రీస్తూ, నూత్న వేద బోధలూను. పునీతులు క్రీస్తు బోధల ప్రకారం జీవించారు. తిరుసభ ఈనాడు మనకు క్రీస్తు బోధలనే తిరిగి చెపూంది. కనుక పునీతుల జీవితాలూ తిరుసభ బోధలూ కూడ మన వివేకానికి ప్రేరణం కలిగిస్తాయి.
వివేకం ప్రధానంగా బుద్ధిశక్తికి సంబంధించింది. లక్ష్యసాధనకు ఏ మార్గాన్ని ఎన్నుకోవాలో బుద్ధిశక్తికే తెలుస్తుంది. కాని అలా యెన్నుకొన్న మార్గాన్ని బుద్ధిశక్తి ఒకోసారి అనుసరించలేదు. అప్పడు చిత్తశక్తి రంగంలోకి దిగి బుద్ధిశక్తి తానెన్నుకొన్న మార్గాన్ని అనుసరించేలా చేస్తుంది.
వివేకంతో మెలగాలంటే ప్రధానంగా మూడు విషయాలవసరం. అవి చక్కగా ఆలోచించడం, సరైన నిర్ణయం చేసికోవడం, కార్యాచరణకు పూనుకోవడం. ఇక్కడ ఈ మూడంశాలను ఒకింత విపులంగా పరిశీలిద్దాం. మొదటిది, మనం చక్కగా ఆలోచించాలి. మొట్టమొదట మనం బాగా ఆలోచించాలి, ఆ విూదట ఇతరుల అనుభవం కూడ పరిశీలించాలి. ఏదైనా సమస్య ఎదురైనపుడు నరులు ప్రాచీన కాలంనుండి ఆ సమస్యను ఏలా పరిష్కరిస్తూ వచ్చారా అని విచారించి చూడాలి. ప్రధాన సత్యాల విషయంలో నరులు. అన్ని కాలాల్లోను ఒకేరీతిగా ప్రవర్తిస్తూ వచ్చారు. కనుక పూర్వుల అనుభవం మనకు పాఠం నేర్పుతుంది. ఇక ఆ సమస్యను ఈనాడు మన జీవితంలో ఏలా పరిష్కరించుకోవాలా అనిగూడ ఆలోచించాలి. ఉదాహరణకు మోక్షసాధనం అనే సమస్యనే తీసికొందాం. ఈ విషయంలో పూర్వకాలంనుండి భక్తులు చేసిన కృషి ఈనాడు మనకు మార్గదర్శకంగా వుంటుంది.
మనం స్వయంగా ఆలోచించి చూచినా, పూర్వం అనుభవాలు పరిశీలించినా, అన్ని సంగతులూ మనకు బోధపడవు. కనుక నిపుణులైనవారిని సలహా అడగాలి. ఒక తలకంటె రెండు తలలు మేలు. ఇతరులతో చర్చించినపుడు సమస్య మరింత స్పష్టమౌతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో అనుభవజ్ఞులైన ఆత్మగురువులను సంప్రతించడం మంచిది. యెరూషలేములో యూదమత నాయకులు గమలియేలు సలహాను పాటించి తాము చంపదలచుకొన్ని అపోస్తలులను చంపకుండా వదలివేసారని వింటున్నాం - అచ 5,38-39,
రెండవది, నిర్ణయం, సలహా మొదలైనవి ముగిసిన తర్వాత ఒక నిర్ణయానికి రావలసింది మనమే. కాని ఈ నిర్ణయం చేసికొనేపడు మనం రాగద్వేషాలకూ ఇష్టానిష్టాలకూ