పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చాడు. ఎలీషా నామానుని వదలిన కుష్ట నిన్ను పట్టిపీడిస్తుందని శిష్యుణ్ణి శపించాడు. ఆ శాపం అక్షరాలా నెరవేరింది - 2రాజు 5,20-27.
3. అహాబు రాజు తన మేడ ప్రక్కన వున్న నాబోతు అనే పేదవాని పొలాన్ని ఆశించాడు. కాని నాబోతు అతనికాపాలాన్ని అమ్మలేదు. కనుక రాజు దుర్మార్గులచే నాబోతు విూద కూటసాక్ష్యం చెప్పించి అతన్ని చంపించి అతనిపొలాన్ని స్వాధీనం చేసికొన్నాడు. అప్పుడు ఏలీయాప్రవక్త రాజుని కఠినంగా మందలించి ఆ పేదవాడి పొలంలోనే నీ నెత్తురు కుక్కలు నాకుతాయి పో అన్నాడు. తర్వాత అతడు చెప్పినట్లే జరిగింది -1రాజు 21,1-16.

4 సీరా గ్రంథం ఈలా చెప్మంది :
"పేదలకిచ్చిందే నీవు భద్రపరచిన నిధియనుకో
అది నిన్ను సకలాపదలనుండి కాపాడుతుంది
బలమైన డాలుకంటె బరువైన యిూటెకంటె గూడ అధికంగా
అది నీ శత్రువుతో పోరాడి నిన్ను రక్షిస్తుంది.

- 29, 12-13.

5, ధనిక యువకుడు ప్రభువు శిష్యుడు కావాలని ఉబలాటపడ్డాడు. కాని ప్రభువు నీ యాస్తిని పేదలకు దానంజేసి నా వెంటరా అన్నాడు. కాని ఆ యువకుడు అధిక సంపదలు కలవాడు కనుక తన సొత్తుని వదలుకోడానికి మనసురాక క్రీస్తువెంట వెళ్ళలేదు — మత్త 19,21–22.
6. ఓ ధనికునికి పంటలు బాగా పండాయి. అతడు నేను సుఖంగా తిని త్రాగుతాను, దేవుడ్డీ తోడినరుజ్జీ పట్టించుకోను అనుకొన్నాడు. కాని ఆ రాత్రే ప్రభువు అతని ప్రాణాలు తీసాడు. ఇరుగుపొరుగువాళ్ళ వచ్చి అతని సొత్తంతా పంచుకొని పోయారు - లూకా 12, 16-20.
7. యూదాలో దయ్యం ప్రవేశించింది. అతడు ఆసబోతుతనంతో గురువుని ముప్పయి వెండికాసులకు అమ్ముకొన్నాడు - లూకా 26, 3-6,
8. యెరూషలేములోని తొలినాటి క్రైస్తవులు పేతురు ఆధిపత్యం క్రింద ఉమ్మడిజీవితం జీవిస్తుండేవాళ్లు, ఈ సమాజానికి చెందిన అననీయా సఫీరా అనే భార్యాభర్తలు పొలం అమ్మకొన్నారు. వచ్చిన సొమ్మలో కొంతమాత్రమే పేత్రుకి ముట్టజెప్పి అతన్ని మోసగించారు. పేత్రు ఆ దంపతులను శపింపగా వాళ్ళు ధిడీలున నేలమిూదపడి ప్రాణాలు విడచారు - అచ 5,1-11.
9. సకల అనర్గాలకు మూలం ధనాపేక్షే-1తిమో 6,10.