పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతన్ని నమ్మడు. సంపదలనే నమ్ముతాడు. అతడు దేవునిమిూద గాక తన సాత్తుమిూదనే ఆధారపడతాడు - కీర్త 52,7.
మన హృదయంలో దేవుడు రాజ్యం చేయాలి. కాని ఆశాపరుల హృదయంలో లోకవస్తువులు రాజ్యాం చేస్తాయి. వాళ్ళ హృదయం భగవంతునికిగాక అతడు చేసిన వస్తువులకు అర్చితమౌతుంది. వాళ్ల విగ్రహారాధకు లౌతారు. ఏ నరుడూ దేవుణ్ణి ద్రవ్యాన్నీ సేవించలేదు. దేవుణ్ణి కొల్చేవాడు ద్రవ్యాన్ని కొలవడు. ద్రవ్యాన్ని కొల్చేవాడు దేవుణ్ణి కొలవడు. కనుకనే ప్రభువు ఇద్దరు యజమానులను సేవించవద్దన్నాడు – మత్త 6,24.
సంపదలను ఆర్ధించేవాళ్ళు తరచుగా ఇతరులను మోసగిస్తారు. ఇతరులకు ముట్టవలసింది తాము కొట్టేస్తారు. ఈ యన్యాయాన్ని చట్టం అంగీకరిస్తుంది. ఐనా ఇది అన్యాయమే. తోడినరుడు తిండిలేక బాధపడుతుంటే నేనొక్కణ్ణి సుఖించడం ఏమి న్యాయం? వాడికి తెలివీ శక్తి లేదుకదా అని వాడికి దక్కవలసింది నేను గుంజుకొని పోవడం ఏమి ధర్మం?
సంపదలకు మన హృదయాన్ని వశంచేసికొనే విచిత్రమైన శక్తి వుంది. ఆ శక్తికి లొంగిపోయినవాడు ఇక భగవంతుణ్ణి పట్టించుకోడు. ఇది గొప్ప అనర్ధం. అవివేకియైన ధనికుడు ఈలాంటివాడే. అతడు "నాకు అనేక సంవత్సరాలకు సరిపడే సంపదలున్నాయి. నేను సుఖంగా తిని త్రాగుతాను. ఇక దేవుణ్ణి పట్టించుకోను" అనుకొన్నాడు - లూకా 12, 16-21.
దురాశలో ఇంకో దుర్గుణం కూడ వుంది. ఆశాపరులు తమ హృదయాన్ని కఠినం చేసికొంటారు. తోడిప్రజల కష్టాలను పట్టించుకోరు. వాళ్ళకు సాయం చేయరు. ధనవంతుడు రోజూ విందులారగిస్తూ తన వాకిట పడియున్న నిరుపేదయైన లాజరుని పట్టించుకోలేదని వింటున్నాం - లూకా 16,19-21. సంపదలవల్ల మన గుండె మొదువారుతుంది. ఇక మనకు పేదసాదలమిూద కరుణ వుండదు.

3. బైబులు దృష్టాంతాలు


1. యోషువా సైనికుల్లో ఆకాను వాకడు. ఆ రోజుల్లో యిస్రాయేలీయులు శత్రుపట్టణాలనూ వాటిల్లో దొరకిన సొత్తునుగూడ కాల్చి నాశం చేసేవాళ్లు, కాని అకాను హాయి అనే పట్టణంలో దొరకిన సొమ్ములో కొంతభాగం, అనగా పట్టుబట్టలూ నాణాలూ రహస్యంగా దాచిపెట్టుకొన్నాడు. దానివల్ల యోషువాకు యుద్ధంలో అపజయం కలిగింది. తరువాత అకాను నేరం బయటపడగా అతనికి మరణశిక్ష విధించారు - యోషు 7.
2. ఎలీషా ప్రవక్త సిరియా సైన్యాధిపతియైన నామానుకి కుష్ణనయంచేసి అతనినుండి ఏమి ప్రతిఫలం పుచ్చుకోలేదు. ఎలీషా శిష్యుడైన గేహసీ మాత్రం నామాను వెంటబోయి మా గురువుగారు అడుగుతున్నారని బొంకి అతనినుండి నాణాలు ఇప్పించుకొని