పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇతరులకు నేల ఏమాత్రం దక్కకుండ జేసారు. కనుకనే భూస్వాములు కూలీలు అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. వీళ్ళలో ఒక వర్గానికి మితం విూరిన భూమివుంటే మరో వర్గానికి ఇల్లు వేసికోవడానికి సెంటు నేలకూడ లేకుండా పోయింది. ఇదే దురాశ.
దురాశ చాల చెడ్డది. ఈ లోక వస్తువులను మితంమిూరి కూడబెట్టుకోవడంవల్ల మనం మూడు పాపాలు చేస్తాం.
మొదటిది, సంపదను సంపద కొరకే ఆశిస్తాం. సంపదవలన అధికారమూ గౌరవమూ శక్తి ఆనందమూ కలుగుతాయి. కనుకనే నరులు సాత్తును అంత మక్కువతో ఆశిస్తారు. కొందరైతే దానిమీదనే పంచప్రాణాలు పెట్టుకొంటారు. దాన్ని దైవంగా భావించి ఆరాధిస్తారు. పూర్వం యిస్రాయేలు ప్రజలు బంగారు దూడను కొల్చారని వింటున్నాం. డబ్బుని ఓ విగ్రహంగా పూజించే వాళ్ళకూడ తక్కువేమిూకాదు. ఈ సృష్టిలో దేవుడొక్కడే తన కొరకు తాను ఆశింపదగినవాడు. కనుక ధనాన్ని దానికొరకు దాన్ని ఆశించకూడదు.
రెండవది, సంపదలను ఆర్థించేవాళ్ళు తరచుగా అపమార్గంలో ఆర్థిస్తారు. లోకానికి అర్థంకాని సూక్ష్మరీతిలో ఇతరులకు ముట్టవలసిన ఆదాయాన్ని తాము కొట్టేస్తారు. పక్కవాడి హక్కులకు భంగం కలిగించి వాడికి చెందవలసింది తమ యింటికి తెచ్చుకొంటారు. లేకపోతే చుటూరా వున్నవాళ్ళ పేదవాళ్లుగా వుండిపోవడమేమిటి, తాము మాత్రమే ధనవంతులు కావడమేమిటి? చుట్టుపట్ల వాళ్ళకి ముట్టవలసింది తాము దక్కించుకోవడంవల్లనే కదా? లోకంలో చట్టసమ్మతమైన అన్యాయం బోలెడంత వుంది. దీన్ని మనం అట్టే గమనించం
మూడవది, సంపదలను సరిగా వినియోగించుకోం, ఉన్నవాళ్ళు చాలమంది తమ డబ్బును సరిగా ఖర్చుచేయనే చేయరు. అత్యాశతో ఆ ధనాన్ని ఇంకా వృద్ధిచేసికో గోరుతారు. డబ్బువల్ల అధికారమూ గౌరవమూ లభిస్తాయని చెప్పాంగదా? కనుక ధనవంతులు తమ సొమ్ముని వదలుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడరు. దాన్ని పేదసాదలకు ఖర్చుపెట్టరు. విద్య ఆరోగ్యం మొదలైన సత్కార్యాలమిూద వెచ్చించరు. ఈ పిసినిగొట్టుల్లో చాల యొక్కువగా వుంటుంది. కాని ధనవంతులందరూ కొంతవరకు పిసినిగొట్టలే. దేవుడు లోకవస్తువులను నరులందరి కొరకూ సృజించాడనీ, మనకక్కరలేని వస్తువులను ఇతరులతో పంచుకోవాలనీ ముందే చెప్పాం, కలిమికలవాళ్ళు ఈ సూత్రాన్ని నిరంతరమూ మిూరుతూనే వుంటారు.

2. దురాశలోని దుష్టత్వం

దురాశలో చాల దుష్టగుణాలున్నాయి. కొన్నిటిని పరిశీలిద్దాం. దురాశ అంటే దేవుణ్ణిగాక లోకవస్తువులను నమ్మడం, పరలోకపు తండ్రి ఆకాశపక్షులను పోషించేవాడు. గడ్డిమొక్కలకు పూబుట్టలు దయచేసేవాడు. ఐనా ఆశాపరుడు