పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పలికి ఆమెను చంపించబోయారు. అప్పడు దానియేలు ఆ వృదుల మోసాన్ని బట్టబయలుచేసి వాళ్ళ తలలు తీయించాడు - దాని 13,19-23.

3. దావీదు రాజు ప్రక్కయింటి ఆడగూతురు బత్తెబాను మోహించాడు. ఆమె భర్తయైన ఊరియాను మోసంతో యుద్ధంలో మొదటి వరుసలో పెట్టించి చంపించాడు. ఆమెను తన యింటికి రప్పించుకొని భార్యను చేసికొన్నాడు. ఈ పాపాలకు సాతాను ప్రవక్త అతన్ని కటువుగా చీవాట్లు పెట్టాడు - 2సమూ 11,2-5.

4. విజ్ఞాన గ్రంథ రచయితలు లైంగికాంశాలను గూర్చి చాల నీతులు చెప్పారు. ప్రస్తుతానికి కొన్నింటిని పరిశీలిద్దాం :

1) నీ సొంత బావినుండి మాత్రమే నీళ్ళ త్రాగు
నీ జలధారనుండి మాత్రమే స్వచ్ఛమైన నీరు సేవించు
నీవు యావనంలో పెండ్లి యాడిన భార్యతో గూడి సుఖించు
ఆమె దీవెనలు పొందునుగాక
ఆవిడ లేడిలాగ దుప్పిలాగ
నీ కంటికి అందంగా కన్పించుగాక- సామె 5,15-19.
2) నిప్పలను రొమ్ము విూద పెట్టుకొంటే
బట్టలు కాలకుండా వుంటాయా?
అగ్ని విూద నడిస్తే పాదాలు మాడకుండా వుంటాయా?
అన్యుని భార్యను కూడినవాడూ ఇంతే

ఆమెను స్పృశించిన వాడికి శిక్ష తప్పదు

- సామె 6,27-29.


3) శీలవతియైన భార్య మనోజ్ఞత యంతింత గాదు
ఆమె సచ్ఛీలాన్ని ఏ తక్కెడతోను తూయలేము
ప్రభువు ఆకాశాన ఉదయభానుడు ప్రకాశించినట్లే
మంచి యిల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకొన్న యింటిలో
వెలుగొందుతూంటుంది
పవిత్ర దీపస్తంభంమిూద దీపం వెలిగినట్లే
సుందరమైన తనువుమిూద ఆమె మొగం మెరుస్తూంటుంది

- సీరా 26,15-17.

4. మోహాన్ని అరికట్టే మార్గాలు

క్రైస్తవులమైన మనం శారీరక పాపాలు చేయకూడదు. మనం జ్ఞానస్నానం పొందినప్పటినుండి పవిత్రాత్మ మన శరీరంలో ఓ దేవాలయంలోలాగ వసిస్తూంటుంది -