పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుండవచ్చు. ఉదాహరణకు ఒక విద్యార్థి పాఠ్యగ్రంథంగా చదవవలసిన నవల వలన అతడు ప్రత్యక్షంగాగాక పరోక్షంగా మోహక్రియను ఆశిస్తున్నాడు. అతని ఆశలో వుండే హెచ్చు తగ్గులను బట్టి అది చావైనపాపమో స్వల్పపాపమో ఔతుంది.

నరులకు అహంకారం తర్వాత మోహమంత ప్రమాదకరమైన పాపం మరొకటి లేదు.

లైంగిక పాపాలవల్ల మనం కొన్ని దురభ్యాసాలకు గురౌతాం. ఈ చెడ్డ అలవాట్లను ఇక వదిలించుకోలేం. అవి మనలను పూర్తిగా వశం చేసికొంటాయి. ఈ యలవాట్లకు లొంగిపోయినవాళ్ళకు ఆధ్యాత్మిక విషయాలు ఎంతమాత్రమూ రుచించవు. పైగా, లైంగిక పాపాలవల్ల మనలోని స్వార్థం కొండంతగా పెరిగిపోతుంది. ఎప్పడూ నేను, నా సుఖం అన్నట్లుగా ఆలోచిస్తాం. ఇక మన కుటుంబ సభ్యులపట్ల, మన బాధ్యతలపట్ల ఆసక్తి చూపం.

ఇంకా, మోహానికి లొంగినపుడు మన శరీరం ఆత్మను దాసినిగా ఏలుతుంది. మనలోని బుద్ధిశక్తి అట్టే పనిచేయక మసకలు కమ్మిపోతుంది. మన భావనాశక్తి ఎప్పడూ శారీరక విషయాలనే ఊహించుకొంటుంది. మన హృదయం లైంగిక సుఖాన్ని దప్పితే మరొకదాన్ని కోరుకోదు. అనగా మనం మృగాల్లా తయారౌతాం.

మోహపాపాన్ని “చీకటి తప్ప" అంటాం. నరులు ఈ తప్పని పదిమంది ముందు బట్టబయలుగా చేయడానికి సిగ్గుపడతారు. కనుక లోకం కన్నుగప్పి దాన్ని చీకటిలో చాటుమాటుగా చేస్తారు. ఇది అంత నీచమైన పాపం. ఎప్పడైనా నరుని శీలాన్ని పరిశీలింపవలసివస్తే అతడు లైంగిక వాంఛలకు లొంగేవాడా కాదా అని నిశితంగా పరిశీలిస్తాం. అనగా మన శీలంలో ఇది ఓ ముఖ్యాంశం అన్నమాట. పవిత్రతకు అంతవిలువ వుంది. కామకార్యాలకు పాల్పడేవాడికి మోక్షరాజ్యంలో స్థానంలేదు అన్నాడు పొలు - ఎఫె 5,5,

3. బైబులు దృష్టాంతాలు

యోసేపు ఐగుప్తన సైన్యాధిపతి యింట వసిస్తూండగా ఆ యధికారి భార్య అతన్ని కామించింది. కాని ఆ సత్పురుషుడు అమ్మా! దేవుడు చూస్తుండగా నేను ఇంత చెడ్డపనికి ఏలా వొడిగట్టేది అని ఆమె కోర్మెను నిరాకరించాడు. అందుకామె అతనిమిూద నేరం మోపి అతన్ని చెరలో త్రోయించింది - ఆది 39,7-10.

2. ఇద్దరు వృద్దులు సూసన్నను కామించి నీవు మా కోర్మెను తీర్చకపోతే మేము నీమీద నేరం మోపి నీకు శిక్ష విధిస్తామని బెదిరించారు. కాని ఆ సాధ్వి ఈలాంటి పాడు పనికి పూనుకొని దేవుని యెదుట పాపం చేయడం కంటె విూరు పెట్టే శిక్ష అనుభవించడమే మేలని పల్కింది. వారు సూసన్నమరెవరితోనే వ్యభిచరించిందని ఆమెవిూద కూటసాక్ష్యం