పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. నీవు భోంచేసేపుడు మృగంలాగ ఆత్రంతో తింటూంటావా, లేక సంయమనాన్ని
పాటిస్తూంటావా?
6.నీవు మితంమిూరి తిని రోగాలు తెచ్చుకొనేవాడివి కాదు గదా?
7. తిండికి తిండిపోతుమీ పనికి పండుబోతువీ కాకుండ నీవు తిన్నదానికి మోయునుగా కష్టపడి పనిచేస్తుంటావా?
8. నీవు వున్నవాడివైతే నీ చుటూవున్న పేదసాదలకుగూడ ఓ ముద్ద పెడుతూంటావా లేక నీమట్టకు నీవే తింటూంటావా?
9. నీవు త్రాగుబోతువి కాదు కదా?
10. భగవంతుడు నీకు దయచేసే అనుదినాహారానికి నీ వతనికి వందనాలు చెపూంటావా?

5. మోహం

1. మోహం అంటే ఏమిటి?

భగవంతుడు భోజనానికి రుచి పెట్టాడు. ఈ రుచికి మరిగి మనం అన్నం తింటాం. అన్నం తినడంవల్ల దేహపోషణం జరుగుతుంది. అలాగే అతడు లైంగిక క్రియకు సుఖం పెట్టాడు. ఆ సుఖానికి మరిగి స్త్రీపురుషులు కలుసుకొంటారు. ఈ కలయికవల్ల సంతానం కలుగుతుంది. భోజనంలోని రుచి దానంతట అది ప్రధానం కాదు. లైంగిక క్రియలోని సుఖం కూడ దానంతట అది ప్రధానం కాదు.

ఈ లైంగిక సుఖాన్ని వివాహ జీవితం జీవించే దంపతులు మాత్రమే అనుభవించవచ్చు. భార్యాభర్తలు కానివాళ్ళకు అది క్రియారూపేణ, మనోరూపేణకూడ నిషిద్ధం. ఆరు తొమ్మిదవ ఆజ్ఞలు పేర్కొనేది ఈ నిషేధాన్నే ఐనా చాలమంది బలహీనతవల్ల ఈ లైంగిక పాపాల్లో పడిపోతుంటారు. మనం చిన్న వాళ్ళంగా వున్నప్పడు లైంగిక శక్తి నిద్రావస్థలో వుంటుంది. యావనం వచ్చేకొద్దీ అది తన ప్రభావాన్ని చూపెడుతుంది.

2. మోహంలోని దుష్టత్వం

మనం ప్రత్యక్షంగా, అనగా బుద్ధిపూర్వకంగా, మోహక్రియలను ఆశిస్తే చావైనపాపం ఔతుంది. ఇక్కడ మనం చేసిన తప్ప పెద్దదా చిన్నదా అన్న ప్రస్తావనం లేదు. ప్రత్యక్షంగా ఆశించిన మోహక్రియ పెద్దదైనా చిన్నదైనాగూడ చావైన పాపమే. దొంగతనంలో పెద్దది చిన్నది అనే తారతమ్యాలున్నాయి. కాని బుద్ధిపూర్వకంగా ఆశించిన మోహక్రియలో అలాంటి తారతమ్యాలు లేవు. ఐతే ప్రత్యక్షంగా గాకుండ పరోక్షంగా ఆశించిన మోహక్రియలో మాత్రం చావైన పాపం స్వల్ప పాపం అనే వ్యత్యాసాలు