పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుప్పనాతితనం చిత్తశాంతిని హరిస్తుంది. ఎదుటివాని వృద్ధిని సహించలేడు కనుక అసూయగ్రస్తుడైనవాడి హృదయం రంపంతో కోసినట్లుగా వుంటుంది. చుప్పనాతితనం కలవాడు తనకుతానే శత్రువు. ఇక అతనికి వేరే శత్రువులంటూ వుండనక్కరలేదు. తెలుగు కవి తిక్కన

“పరుల ధనమునకు విద్యా
      పరిణతికిం దేజమునకు బలమునకు మనం
      బెరియగ నసహ్యపడు న
      న్నరుడు తెవులు లేని వేదనంబడు నధిపా"

అన్నాడు. ఓర్వలేని తనంవల్ల పట్టే మనోవ్యాధికి మందు లేదు.

3. బైబులు దృష్టాంతాలు

1 సృష్ట్యాదిలో కయీను హేబెలు విూద అసూయపడ్డాడు. కయీను పొలంలో పండిన పంటను దేవునికి కానుక పెట్టాడు. హేబెలు గొర్రెపిల్లలను కానుక పెట్టాడు. కాని కయీనుది కపట హృదయం. అందుచేత ప్రభువు హేబెలు కానుకను స్వీకరించి కయీను కానుకను నిరాకరించాడు. కనుక కయీను తమ్ముడి విూదపడి అతన్ని చంపివేసాడు - ఆది & 4,3-8.

2. ఈసాకు దైవబలం కలవాడు. అతడు పొలంలో యెదవెట్టగా నూరురెట్ల పంట చేతికి వచ్చింది. అతని గొడ్లూ గొర్రెలూ విస్తరించాయి. ఈసాకు భోగభాగ్యాలను చూడగా ఫిలిస్టీయులకు కన్నుకుట్టింది - ఆది 26,13-14.

3. యాకోబు భార్యలైన లెయా రాహేలు అక్కాచెల్లెళ్లు, అక్కకు సంతానం కలిగిందిగాని చెల్లెలు గొడ్రాలుగా వుండిపోయింది. లెయా పిల్లలను జూచి రాహేలు కండ్లల్లో నిప్పులు పోసికొంది. నాకుగూడ పిల్లలను పుట్టిస్తావా లేక నుయ్యో గొయ్యో చూచుకొమ్మంటావా అని భర్తమీద విరుచుకపడింది - ఆది 30,1-2.

4. యాకోబుకి తన పండ్రెండుమంది కొడుకుల్లోను యోసేఫంటే యిష్టం, ఆ ముద్దుల కొడుక్కి పొడుగుచేతుల నిలుపుటంగీని కుట్టించాడు. అదిచూచి సోదరులు కడుపుమండి యోసేపతో మాట్లాడ్డం మానివేసారు. అతన్ని గోతిలో పడద్రోసి నానాబాధలు పెట్టారు - ఆది 37,3-4, 19–28.

5. సౌలు యిప్రాయేలీయులకు తొలిరాజు. దావీదు అతని కొలువులో బంటు. ఫిలిస్ట్రీయులు యిప్రాయేలీయులకు ప్రబల శత్రువులు. ఓసారి సౌలుదావీదులు ఫిలిస్టీయుల విూదికి యుద్దానికి వెళ్లి వాళ్లను చితుకగొట్టి తిరిగివస్తున్నారు. దారిలో ఓ వూరిలో కొందరు స్త్రీలు నాట్యంచేసి రాజుకు స్వాగతం పలికారు. వాళ్లు "సౌలు వేయిమందిని చంపాడు, కాని దావీదు పదివేలమందిని చంపాడు” అని పాట పాడారు. ఆ పాట విని సౌలు