పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దావీదుమిూద అసూయ పడ్డాడు. అతన్ని అణగదొక్కాలని యత్నం చేసాడు. ఇంకోమారు దావీదు తన ముందట సితారా వాయిస్తుండగా అతనిమిూద బల్లెం విసిరాడు. దావీదు నేర్చుతో ప్రక్కకు తప్పకొన్నాడు. బల్లెం పోయి గోడకు గ్రుచ్చుకొంది - 1సమూ 18,6- 11; 19,8-10.

6. క్రీస్తు శిష్యులకు మొదటిలో దైవరాజ్యమంటే యేమిటో సరిగా అర్థంకాలేదు. అదికూడ ఈలోకరాజ్యం వంటిదే ననుకున్నారు. వాళ్లు ఆ రాజ్యంలో ఎవరికి వాళ్లే ప్రథమస్థానాలు ఆక్రమించుకోగోరారు. ఈ కోరికతోనే వాళ్లు ఒకరిమిద ఒకరు పోటీకి దిగేవాళ్లు, ఒకరినిజూచి ఒకరు అసూయ పడేవాళ్చు. అందుకు ప్రభువు వాళ్లను మందలించాడు. విూలో ప్రథముడు కాగోరేవాడు సేవకుడుగాను, చిన్నబిడ్డగాను తయారుకావాలని హెచ్చరించాడు - మార్కు 9,33–37

7. శిష్యులైన యోహాను యాకోబులు క్రీస్తుకి దగ్గరి బంధువులు. వాళ్ళు ఓసారి తమ తల్లిని వెంటబెట్టుకొని క్రీస్తు దగ్గరికి వచ్చారు. ఆమె నా కుమారులిద్దరికీ నీ రాజ్యంలో ప్రథమ స్థానాలీయమని అడిగింది. ఈ సంగతి యితర శిష్యులకు తెలిసింది. ముఖ్య పదవులను మాకు చిక్కనీయకుండా విూరే కొట్టివేయబోతున్నారా అని వాళ్లు వీళ్లవిూద మండిపడ్డారు - మత్త 20,20-24

8. ఓసారి ఓ అనామక శిష్యుడు క్రీస్తు పేరుమిూదిగా దయ్యాలను వెళ్లగొడుతున్నాడు. శిష్యులు అతన్ని జూచి ఓర్వలేక నీవు మా గురువు పేరుమిూదిగా భూతాలను వెళ్లగొట్టవద్దని ఆజ్ఞాపించారు. కాని అతడు వాళ్లను కాతరు చేయలేదు. శిష్యులు అసూయతో క్రీస్తుకు ఫిర్యాదు చేసారు - లూకా 9,49-50,

9. తూర్పుదేశపు జ్ఞానులు హెరోదు కొలువుకూటంలోకివచ్చి "యూదులకు రాజుగాపట్టిన శిశువేడి? మేము తూర్పున అతని నక్షత్రాన్ని చూచి అతన్ని ఆరాధించడానికి వచ్చాం" అని అడిగారు. ఆ మాటలకు హెరోదు తల్లడిల్లాడు. ఆ శిశువు తన సింహాసనాన్ని ఆక్రమించుకొంటాడేమోనని అసూయ పడ్డాడు. కావుననే అతడు ఘాతుకబుద్ధితో పసిబిడ్డలను చంపించాడు - మత్త 2,1-3.16.

10. స్నాపక యోహాను గొప్ప రబ్బయిగా వచ్చి బోధిస్తున్నాడు. అతడు చాలమంది శిష్యులను ప్రోగుజేసికొని యోర్తానులో ప్రజలచే శుద్దీకరణ స్నానాలు చేయిస్తున్నాడు. అంతలో క్రీస్తువచ్చి యోహానుకంటే గొప్ప రబ్బయిగా దర్శనమిచ్చాడు. కాని క్రీస్తునిచూచి యోహాను అసూయ పడలేదు. “అతడు హెచ్చాలి, నేను తగ్గాలి" అని పల్కాడు - యోహా 3,30.

11. యూద ప్రజలు క్రీస్తు బోధలకూ అద్భుతాలకూ మురిసిపోయి అతనివెంట బోవడం మొదలెట్టారు. అందువలన ప్రధానాచార్యులకు మత్సరం పుట్టింది. వాళ్ళు ఓర్వలేనితనంతో క్రీస్తుని పిలాతున కప్పగించారు - మార్కు 15,10.