పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. అసూయ

1. అసూయ అంటే ఏమిటి?

లోకంలో అసూయకు గురికాని నరుడుండడు. అసూయ లేనివాడు దేవుడంతటివాడు. ఇతరుల వృద్ధిని సహింపక బాధపడ్డమే అసూయ, నిర్మల పద్మకు ఎక్కువ మార్కులు వచ్చాయని బాధపడింది. రామారావుచేను తనచేను కంటె ఎక్కువగా పండిందని సుబ్బారావు బాధపడ్డాడు. ఇదే అసూయ. ఇతరుల వృద్ధివల్ల మనకు హాని కలుగుతుందేమోనని భయపడతాం. ఇతరులు అధికులైతే మనం అణగారిపోతామేమో ననుకొటాం. అసూయ గర్వం వలన పడుతుంది. లోకంలో మనకంటె పైవాడు ఉండకూడదని మన భావం. అందుకే మనకంటె అధికుణ్ణి చూచినప్పడు మనం ఓర్చుకోలేం. అన్యులు మన యెదుట ఇతరుణ్ణివరినైనా మెచ్చుకొంటే మనం సహించలేం. ఆ మెప్పు పొందినవాడ్డి విమర్శించి దూయబడతాం. అతడు మనకంటె తక్కువ వాడని నిరూపించబోతాం. ఈ దుర్విమరువల్ల పాపం మూటగట్టుకొంటాం.

అందరి హృదయాల్లోను అసూయ వుంటుంది. మన శత్రువులకు కలిగిన లాభానికి మాత్రమేకాదు, మిత్రులకు సిద్ధించిన లాభానికి గూడ బాధ చెందుతాం. తోడి నరుని భౌతిక లాభాలకు మాత్రమేకాదు, ఆధ్యాత్మిక వరాలకు గూడ వ్యధ చెందుతాం. దీన్నిబట్టి ఈ దురుణం విశ్వవ్యాప్తమైందని అర్థం చేసికోవాలి. ఐనా చాల మందికి తాము అసూయ పడుతున్నామని తెలియను గూడ తెలియదు. ఇది చాలా విచిత్రమైన సంగతి.

2. అసూయ వలని అనర్గాలు

ఎవని మిూద అసూయ పడతామో అతని మిూద మనకు ద్వేషభావాలు జనిస్తాయి. "ప్రేమ అసూయపడదు" అన్నాడు పౌలు - 1కొ 13,4. నిజమైన ప్రేమ వున్నకాడ అసూయ వుండదు. అసూయ వున్నకాడ నిర్మలమైన ప్రేమ వుండదు. కనుక అసూయ ద్వారా తోడి నరుల విూద ద్వేషమూ అనిష్టమూ పెంచుకొంటాం.

ఇంకా, నరులు బృందాలుగా పనిచేసేకాడ అసూయాపరులైనవాళ్లు మరాలు లేవదీస్తారు. సరోజ టీచరు. ఆమె నిర్మల టీచరుని సహించలేదు. కనుక సరోజ కొందరు ఉపాధ్యాయులను కలుపుకొని ఓ ముఠాను తయారుచేసికొంది. ఆమె వర్గం ఎప్పడూ నిర్మల వర్గాన్ని వ్యతిరేకిస్తుంది.