పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. ఏడు మూలపాపాలు

1. గర్వం

ఆదాము పాపంవల్ల మన మనుష్యన్వభావం గాయపడి దెబ్బతింది. నరులందరిలోను పాపాభిలాష పెరిగింది. ఈ పాపాభిలాషనుగూర్చి చెపూ యోహాను “ఈ లోకంలో వున్నదంతా శారీరక వ్యామోహం, నేత్ర వ్యామోహం, జీవితం నందలి అహంభావం" అని చెప్పాడు — 1రయోహా 2,16, ఈ యహంభావం నుండి అసూయ, కోపం, పొగడ్డలపట్ల ప్రీతి మొదలైన దురుణాలు పుట్టకవస్తాయి. శారీరక వ్యామోహం నుండి భోజన ప్రియత్వం, కామం, సోమరితనం మొదలైనవి పుడతాయి నేత్రవ్యామోహంనుండి దురాశ పడుతుంది, ఈ విధంగా మూలపాపాలు ఏడు మన హృదయంలో చోటు చేసికొంటాయి. ఈ మూల పాపాలనుండి చాల యితర పాపాలు కూడ పుట్టుక వస్తాయి. ఇక, యీ మూలపాపాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. గర్వం అంటే ఏమిటి?

Şජාද් అధికంగా కన్పించే దురుణం గర్వం. లోకంలో గర్వాత్మలు కానివాళ్ళు అరుదు. నరుడు తన్నుతాను మితంమిూరి ప్రేమించుకోవడమే గర్వం. ఈ గర్వంవల్ల మనకు మనమే సృష్టికర్తలం అన్నట్లు భావిస్తాం. మన గమ్యం కూడ మనమే అన్నట్లు ఎంచుతాం. మన సృష్టికర్త, మనం చేరవలసిన తీరం దేవుడేనని గ్రహించం. ప్రతి నరుడు కూడ గాలి పీల్చినంత సహజంగా తన్ను తాను ప్రేమించుకొంటాడు, కాని ఈ ಸ್ಪಿಯಿ ప్రేమకు హద్దులుండాలి. లేకపోతే అది పొగరైపోతుంది. గర్వం విశేషంగా రెండు రూపాల్లో కన్పిస్తుంది. మొదటిది, మనకు మనమే సృష్టికర్తలం అన్నట్లుగా భావిస్తాం అని చెప్పాం. రెండవది, మన గమ్యం మనమే అన్నట్లు తలుస్తాం అని చెప్పాం. ఈ రెండంశాలను కొంచెం విపులంగా పరిశీలిద్దాం.

1) మనకు మనమే సృష్టికర్తలమా?

ప్రత్యక్షంగా తమకు తామే సృష్టికర్తలమనుకొనేవాళ్ళు తక్కువే. నాస్తికులు ఈలా భావిస్తారు. వాళ్ళ దేవుణ్ణి నిరాకరిస్తారు. “మూర్ణుడు దేవుడు లేడులే అని ఎంచుతాడు" -కీర్త 14,1. పిశాచంకూడ దేవుని అధికారాన్ని నిరాకరించింది. అలాగే ఆది దంపతులుకూడ తాము పాపం చేసినప్పడు దేవుని అధికారాన్ని ధిక్కరించారు. కొందరు హేతువాదులు కూడ దేవుణ్ణి నిరాకరిస్తారు. ఈలాంటి వాళ్ళంతా తమకు తామే సృష్టికర్తల మనుకొంటారు. 167