పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చాలమంది ప్రత్యక్షంగా కాదుగాని, పరోక్షంగా తమకు తామే సృష్టికర్తల మనుకొంటారు. అనగా వీళ్ళ తమలోని మేలిగుణాలకు తమ్ముతామే స్తుతించుకొంటారు. ఆ గుణాలను తామే స్వయంగా కృషిచేసి సాధించామనుకొంటారు. తాము దేవునిమిూద ఆధారపడి జీవిస్తున్నాం అన్న సంగతి మర్చిపోతారు. మోషే "మిూరు ఏనాడు కూడ మా శక్తితోనే మేము సంపన్నుల మయ్యాం అని భావించవద్దు" అని చెప్పాడు - ద్వితీ 8, 17. ఈ సత్యాన్ని వీళ్లు మర్చిపోతారు. తమ్ముతాము అతిగా పొగడుకొనేవాళ్ళంతా యీ వర్గంవాళ్ళే ఇంకా కొందరు తమ మేలిగుణాలను పెద్దజేసి చూపిస్తుంటారు. అతిశయోక్తులు పలుకుతుంటారు. కొంచెం దానంజేసి తామేమో గొప్ప దాతలైపోయినట్లుగా భావిస్తారు. తామే నీతిమంతులమనుకొని ఇతరులను చిన్నచూపు చూస్తారు. కాని మనకు మనం ఏనాడూ సృష్టికర్తంలగాము. మనలోని మేలిగుణాలకు మనం కర్తలంగాము. మనకున్నవన్నీదేవుడిచ్చినవే. కనుక మనం నిరంతరమూ అతనిమిూద ఆధారపడి జీవించాలి.

2) మన గమ్యం మనమేనా?<

/

చాలమంది తమకుతామే గమ్యమన్నట్లుగా ఊహిస్తారు. తమ కార్యాలనూ విజయాలనూ తామే స్వయంగా సాధించామన్నట్లుగా మాట్లాడుతారు. దైవ సహాయాన్ని గుర్తించరు. తమ విజయాలకుగాను ప్రజలు తమ్ము పొగడాలని కోరుకొంటారు. స్వార్థంతో అందరిదృష్టిని తమవైపు ఆకర్షించుకోబోతారు. ప్రజలు దేవునిదగ్గరికి గాక తమ దగ్గరికి రావాలని కోరుకొంటారు. ఇంకా కొందరు ఆధ్యాత్మికంగా తాము పొందిన వరాలను తామే స్వయంగా సాధించినట్లుగా ఎంచుతారు. తమ పుణ్యానికి తామే కారకులమనీ, ఆ పుణ్యానికి దేవుడు తమకు తప్పకుండా మోక్షభాగ్యం దయచేయాలనీ భావిస్తారు. so దేవుడొక్కడే తనకుతాను గమ్యం, మనకు మనం గమ్యం కాము. ఈ లోకంలో మనకొరకు మనం లేము. మన గమ్యమూ, మనం చేరవలసిన రేవూ, ఆ భగవంతుడే. పై సంగతులను పరిశీలిస్తే మనలో వినయం తక్కువనీ గర్వం ఎక్కువనీ తేలుతుంది, మనమందరమూ ఎప్పడూ, ఏదో వొకరూపంలో గర్వాన్ని ప్రదర్శిస్తూనే వుంటాం, అందుకే గర్వాత్మలు కానివాళ్ళు చాల అరుదని చెప్పాం.

2.గర్వం నుండి పట్టే కొన్ని దురణాలు

అరటి చెట్టునుండి పిలకల్లాగ, గర్వంనుండి చాల దురుణాలు పుట్టుకవస్తాయి. ప్రస్తుతానికి ఓ మూడింటిని మాత్రం పరిశీలిద్దాం. మొదటిది, అతి సాహసం. ఈ గుణం 168