పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5.“దేవుని బిడ్డలు దేవుని యాత్మచే నడిపింపబడతారు" - రోమా 8,14. మనం కూడ ఈలా నడిపింపబడుతున్నామని అనుభవపూర్వకంగా చెప్పగలమా?

6.యెరూషలేము మహాసభలో ఆత్మ ప్రేషితులకు నిర్ణయాలు చేసిపెట్టింది. మన జీవితంలో ఆత్మ యేమైన నిర్ణయాలు చేసిపెట్టిందా? అసలు మనకు కష్టాల్లోను చిక్కుల్లోను ఆత్మను సంప్రతించే అలవాటు అంటూ వుందా?

7.తొలినాటి క్రైస్తవ సమాజాలకు ఆత్మ ఆదరణను ఆనందాన్ని ఇస్తూ వుండేది - 9,31; 13, 52. మనకూ క్రైస్తవ జీవితంలో ఆత్మ యధార్థమైన ఆనందాన్ని సంతృప్తిని ఉత్సాహాన్నీ అనుగ్రహిస్తుందా?

8.ఆత్మ చేత నడిపింపబడిన తొలినాటి క్రైస్తవ సమాజంలోనే అవకతవకలు ఉండేవి అన్నాం. ఇక మన సమాజాల్లోని అవకతవకలను ఆయా వ్యక్తుల బలహీనతలను జూచి నిరుత్సాహపడుతూండాలా?

9.పౌలు ఎఫేసీయులను జూచి "మీరు ఆత్మను పొందారా" అని అడిగాడు. ఈ ప్రశ్నే మనల నడిగితే ఏంసమాధానం చెప్పగలం? 19,1, ఆత్మ అనుగ్రహించే ఫలాలను మనం అనుభవిస్తున్నామా? - గల 5,22.