పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రీకు క్రైస్తవులు కూడ యూదుల ధర్మశాస్తాచారాలను పాటించాలి అన్నారు యాకోబు పేత్రు మొదలైన యెరూషలేము పెద్దలు పాటించనక్కరలేదన్నారు పౌలుమొదలైన అంతియోకయ పెద్దలు, ఈ యంశంపై పౌలు పేత్రు పోట్లాడుకున్నారు. దానిని పురస్కరించుకొనే మొదటి యెరూషలేము మహాసభ జరిగింది - అచ 15, ఈ పోట్లాటలో పౌలుకు పేత్రే తగ్గిపోయాడు - గల 2,11-12.

మానవుల బలహీనతలు ఈలాగుంటాయి. పరిశుదాత్మ నరులకు సహాయంచేస్తుంది. కాని నరుల బలహీనతలన్నీ ఒక్క క్షణంలో రూపుమాపదు.

8.అన్వయం

ఇంతవరకు పరిశుద్ధాత్మ తొలినాటిశిష్యులను ఏలానడిపిందో వివరించాం. ఇక,యీ సత్యాలు మన జీవితానికి ఏలా అన్వయిస్తాయో విచారించి చూద్దాం.

l.తొలినాటి యెరూషలేం సమాజం ఆత్మతో నిండుకొని వుండేది. ఆత్మ అనుగ్రహంవల్ల వాళ్ల సమష్టిగా సమాజ జీవితం జీవించేవాళ్లు.ఏక మనస్కులై వుండేవాళ్లు.ఆరాధనలో ప్రార్థనలో పాల్గొనేవాళ్లు. నేడు మనక్రైస్తవ జీవితంలో గూడ ఆత్మ ఈ యానుగ్రహాలను ప్రసాదిస్తువుందా? క్రైస్తవ జీవితం ప్రధానంగా సామాజిక జీవితం అన్న అంశాన్ని మనం గుర్తిస్తున్నామా?

2.ఆత్మ ప్రేషితులను క్రీస్తునకు సాక్షులనుగా జేసింది. వాళ్లు తమ బోధలవల్ల,బాధలవల్ల,ధైర్యప్రవర్తనంవల్ల, ప్రార్ధనవల్ల, సోదరప్రేమవల్ల, క్రీస్తుకు సాక్ష్యంగా నిలచారు. నేడు మనమూ క్రైస్తవ జీవితం జీవిస్తూ క్రీస్తు తరఫున ప్రపంచానికి సాక్ష్యంగా వుంటున్నామా?

3.తొలి సమాజంలోని నాయకులు ఆత్మతో నిండుకొనివుండేవాళ్లు, నేటి మన సమాజాల్లోని పెద్దలు ఈలా ఆత్మతో నిండుకొని వుంటున్నారా? అసలు మన పెద్దలు - ఆత్మ ద్వారా అధికారంలోకి వస్తున్నారా? ఆత్మయందు అధికారం నెరుపుతూన్నారా? - 20,28.

4.ఆత్మ తొలినాటి క్రైస్తవులను ప్రేషిత కార్యానికి నడిపించుకొని పోయింది. నేడు మనం పాల్గొనే వివిధ ప్రేషిత రంగాల్లో ఆత్మచే నడిపింప బడుతూన్నామా? ఈ కాలానికి తగినట్లుగా క్రొత్తక్రొత్త ప్రేషిత కార్యాలు ప్రారంభిస్తున్నామా?