పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. పూర్వవేదంలో కాంతిమంతమైన మేఘం గుడారం మీదికి దిగివచ్చేది - నిర్గ 33,9. ఈ మబ్బు ఆత్మకు చిహ్నం. నూత్నవేదంలో ఈ మొయిలుకు మారుగా పవిత్రాత్మే కన్యమరియ మీదికి దిగివచ్చింది — లూకా 1,35. క్రీస్తు ఆత్మద్వారాను, తేజస్సు ద్వారాను గూడ ఉత్తానమయ్యాడు - రోమా 8,11, 6,4. మనం ఉత్థానక్రీస్తుతేజస్సులోనికి మారిపోతాం - 2కొ 3,18. ఆత్మా తేజస్సు ఒకటేనని చెప్పాం. కావననే 1షేత్రు 4,14 "తేజోమయమైన దేవుని ఆత్మ’ అని వాకొంటుంది. “మానవులందరూ పాపంచేసి, దేవుని తేజస్సును కోల్పోయారు" అంటుంది రోమీయుల జాబు 3,23. అనగా పాపంవల్ల మనం దేవుని ఆత్మను పోగొట్టుకొన్నామని భావం. (తెలుగు బైబుళ్ళు “తేజస్సు" అనే మాటను "మహిమ? అని అనువదించాయి. ఇది పొరపాటు.)

ప్రార్థనా భావాలు

ఓ ప్రాచీన క్రైస్తవభక్తుడు "వేని క్రెయాతోర్ స్పిరుతుస్" అనే గేయం వ్రాసాడు. ఆత్మపట్ల భక్తిని పెంపొందించుకోడానికి ఈ గీతం బాగా ఉపయోగపడుతుంది.

1. "సృష్టికర్తవైన పవిత్రాత్మమా!
నీ భక్తుల హృదయాలను సందర్శించు
నీ బిడ్డలమైన మా యెడదలను
వరప్రసాదాలతో నింపు
2. నీవు ఉపశమనదాతవ
మహోన్నతుడైన దేవుని వరానివి
జీవజలానివి, అగ్నిజ్వాలవు, ప్రేమమూర్తివి,
అభ్యంగన కర్తవు
3. నీవు సప్తవరదాతవు
దేవుని కుడిచేతి వ్రేలివి
పరమపిత వాగ్దానానివి
మాకు వాకుక్తిని ప్రసాదించు
4. మమ్ము నీ వెలుగుతో నడిపించు
మా హృదయాలను నీ ప్రేమతో నింపు
నీ మహాశక్తితో
మా దౌర్బల్యాన్ని తొలగించు