పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. శత్రువైన పిశాచాన్ని దూరంగా పారద్రోలు
మాకు శాంతిని దయచేయి
మా నాయకుడవైన నిన్ననుసరిస్తూ
మేము సకలాపదలనుండి తప్పించుకొందుముగాక
6. 5 కృపచే తండ్రిని తెలుసుకొందుముగాక
నీ కరుణచే సుతుని గుర్తింతుముగాక
వారిరువురి ఆత్మవైన నిన్ను
సదా విశ్వసింతుముగాక.

5. పవిత్రమైన ఆత్మ

1. ఆత్మశక్తి, తేజస్సు మాత్రమేకాదు, పవిత్రత కూడ. శక్తి, తేజస్సు, పవిత్రత ఈ మూడు భావాలకు పరస్పర సంబంధం వుంది.

యెషయా ప్రవక్త దర్శనంలో చూచిన దేవుణ్ణి దేవదూతలు "సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు లోకమంతా అతని తేజస్సుతో నిండి వుంది" అని స్తుతిస్తున్నారు - యొష 6,3. ప్రభువు పరాత్పరుడు. నరులకు దూరంగా వుండేవాడు. కనుక పవిత్రుడు. హోషేయ ప్రవచనంలో అతడు "నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని" అంటాడు - 119. తండ్రిలాగే ఆత్మడు కూడ నరులకు దూరంగా వుండేవాడు. కనుక పవిత్రుడు, 2. ఆత్మడు పరలోకానికి చెందినవాడు. కావున పవిత్రుడు. అతడు పైనుండి దిగివచ్చే శక్తి - అ.చ.1,8. స్వర్గంనుండి క్రీస్తుమీదికి పావురంలా దిగివచ్చినవాడు - మార్కు 1,10. పరమండలం నుండి శిష్యులమీదికి గాలిలా వేంచేసినవాడు - అ, చ. 2, 2.

3. క్రీస్తు దేవుని పవిత్రమూర్తి - మార్కు 1,24. ఇతడు ఆత్మద్వారా నరరూపం దాల్చినవాడు, ఆత్మద్వారా పవిత్రుడైనవాడు - లూకా 1,85. దేవుడు అతన్ని పవిత్రాత్మతోను శక్తితోను అభిషేకించాడు - అ.చ. 10,38. క్రీస్తు పునరుత్తానుడైనందున పవిత్రపరచే ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడ్డాడు - రోమా 1,4. పవిత్రుడైన ఆత్మడే క్రీస్తుని పవిత్రపరచాడని ఈ వేదవాక్యాల సారాంశం.