పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. నీ దివ్య సహాయం లేందే
నరుల్లో పాపం దప్ప
మంచి అనేదే చూపట్టదు
7. అపవిత్రులమైన మమ్మ శుద్ధిచేయి
ఎండిపోయిన మమ్ము నీటితో తడుపు
మా గాయాలను మాన్పు
8. లొంగని మా హృదయాలను లొంగదీయి
మా కఠిన మనస్సులను కరిగించు
దారిదప్పిన మమ్ము త్రోవకు జేర్చు
9. నిన్ను విశ్వసించే భక్తులకు,
నిన్ను పూజించే విశ్వాసులకు,
నీ యేడు వరాలను ప్రసాదించు
10. పుణ్యాచరణకు తగిన ఫలాన్నీ
ధన్యమైన మరణాన్నీ
శాశ్వత మోక్షానందాన్నీ మాకు దయచే్యి"

4.ఆత్మ దేవుని తేజస్సు

1. పూర్వవేదంలో ఆత్మ దేవుని తేజస్సు. ఈ తేజస్సు యిప్రాయేలీయులకు సీనాయి కొండపై నిప్పలా దర్శనమిచ్చింది. 'యావే తేజస్సు సీనాయికొండమీద నిల్చింది. ఆరురోజులపాటు మొయిలు కొండను క్రమ్మింది. యావే తేజస్సు కొండ కొమ్మన ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా యిప్రాయేలీయులకు కన్పించింది" - నిర్గ 24, 16-17. ఈ తేజస్సు ప్రకాశపూరితమైన ప్రభువు సాన్నిధ్యమే.

ఈ కాంతే దేవుడు చేసే అద్భుతాల్లోకూడ కన్పిస్తుంది. ప్రభువు మన్నాను కురిపించే సందర్భంలో మోషే యిప్రాయేలీయులతో "మీరు ఉదయం ప్రభువు తేజస్సును చూస్తారు" అన్నాడు - నిర్ధ 16,7. లాజరు ఉత్తాన సందర్భంలో క్రీస్తుకూడ మార్తతో "నీవు విశ్వసించినట్లయితే దేవుని తేజస్సును చూస్తావు" అని పల్మాడు - యోహా 11,40. ఇక్కడ తేజస్సు దేవుడు చేసే అద్భుత కార్యాలే. నూత్నవేదంలో తేజస్సు ఆత్మ అనే పదాలు ఒకదానితో ఒకటి మిళితమైపోయాయి. "అప్పడు మనుష్య కుమారుడు మహాశక్తితోను తేజస్సుతోను మేఘారూఢుడై రావడం చూస్తారు" - మార్కు 13,26. ఈ వాక్యంలో శక్తి తేజస్సూ కూడ ఆత్మే