పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్యభాషల్లో మాటలాడి ప్రభువును స్తుతించేవాళ్లు, శిష్యులూ ఆలాగే స్తుతించారు - 24. కనుక నాలుకలు భాషలకు చిహ్నం.

ఆత్మ దిగివచ్చిన యీ సంఘటనకు 400 సంవత్సరాలకు ముందే యోవేలు అనే ప్రవక్త"ఆంత్య దినాల్లో నరులందరి మీద నా యాత్మను కుమ్మరిస్తాను, నా దాసులు దాసురాళ్లు ప్రవచనం చెప్తారు" అని పలికాడు - అ,చ. 2,16-18, అతని ప్రవచనం ప్రకారమే ఆత్మ దిగివచ్చింది. ఈ యాత్మ యెవరోకాదు. క్రీస్తు తాను పొందిన ఆత్మే ప్రవక్తలద్వారా తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను క్రీస్తు మొదట తాను పొందాడు. ఆపిమ్మట తాను పొందిన ఆత్మను శిష్యుల మీదా కుమ్మరించాడు - 2, 33. పాపాలకోసం పశ్చాత్తాపపడి మారుమనసు పొంది, క్రీస్తు పేరుమీదిగా జ్ఞానస్నానం పొందేవాళ్లంతా ఈయాత్మను పొందుతారు - 2, 38-39. మనమూ జ్ఞానస్నాన సమయంలోనే ఈ యాత్మను పొందాం.

3. తొలి సమాజం ఆత్మతో నిండుకొని వుండేది

యెరూషలేములోని తొలి క్రైస్తవ సమాజం ఆత్మతో నిండుకొనివుండేది. దాని ఫలితంగా వాళ్ళు ఏక మనసులై ఏకంగా కూడివుండేవాళ్ళు ఓ విధమైన సామాజిక జీవితం జీవించేవాళ్ళు ఆస్తిని సమష్టిగా వాడుకునేవాళ్ళ దేవాలయానికివెళ్లి ప్రార్ధనం చేసికునేవాళ్ళ దివ్యసత్రసాదంలో పాల్గొనేవాళ్ళ క్రీస్తు ఉత్తానానికి సాక్ష్యంగా వుండేవాళ్ళ అపోస్తలుల చర్యల గ్రంథం రెండు పట్టుల్లో ఈ సమాజిక జీవితాన్ని స్పష్టంగా వర్ణిస్తుంది -2, 43-17. 4, 32-37.

ఈ సామాజిక జీవితానికి వ్యతిరేకంగా పోయినవాళ్ళు ఆత్మకు వ్యతిరేకంగా పోయినట్లే, అందుకే సమాజపు పెద్దయైన పేత్రును మోసంజేసిన అననీయ ఆత్మనే మోసంజేసాడని చెప్పబడింది - 5, 3. పేత్రును శోధించిన అననీయ భార్య సఫీరా పరిశుద్దాత్మనే మోసం జేసినట్లు నుడువబడింది - 5,9.

4 అపోస్తలులు క్రీస్తునకు సాక్షులుగా నిలిచారు

ఆత్మ అపోస్తలులచేత క్రీస్తుకు సాక్ష్యం ఇప్పించింది. పేత్రు అద్భుతంగా కుంటివాణ్ణి నడిపించాడు. అది చూచి యూదుల ఆచార్యులు అసూయపడి పేత్రును యోహానును వారి మహాసభయెదుటకు పిలిపించారు. ఇంతకుముందు పనిపిల్లకు