పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. అపోస్తలుల చర్యలు - వీరిశుద్దాత్మ

ఉపోద్ఘాతం

పరిశుద్దాత్మ తొలినాటి క్రెఐస్తవ సమాజాన్ని నడిపించిన విధానాన్ని గూర్చి అపోస్తలుల చర్యల గ్రంథంలో చదువుతూన్నాం. ఆత్మయీనాటి క్రైస్తవులనూ, విశేషంగా మఠ జీవితంద్వారా తమ జీవితాన్ని క్రీస్తునకు అంకితం జేసికున్న స్త్రీ పురుషులనూ, నడిపిస్తూనేవుంటుంది. కనుక ప్రస్తుతం మనం చూచే అంశం, ఆత్మచేత నడిపింపబడ్డం.

1. క్రీస్తు వాగ్దానం

క్రీస్తు ఉత్తానమై మోక్షానికి వెళ్ళిపోతూ, తండ్రి వాగ్దానమైన ఆత్మను పొందిందాక యెరూషలేమును వీడిపోవద్దని శిష్యులను ఆజ్ఞాపించాడు - అ, చ, 1,4. అందుచేత శిష్యులు ఆ యాత్మకోసం ఎదురుచూస్తూ, యెరూషలేములో వుండిపోయారు. ఉత్తానక్రీస్తు ఇకమీదట తన యాత్మ ద్వారాగాని శిష్యులతో సంబంధం పెట్టుకోడు. ఆత్మద్వారాగాని భూమిమీద తాను ప్రారంభించిన రక్షణకార్యాన్ని కొనసాగించడు. అందుచేతనే ఈ యాత్మకు "క్రీస్తుఆత్మ" అని పేరు -16,7. శిష్యులు ఈ యాత్మ యందు గాని జ్ఞానస్నానం పొందరు -1, 5. అనగా ఆత్మ దిగిరావడమే వాళ్లజ్ఞానస్నానం. ఆత్మద్వారానే శిష్యులు శక్తినిపొంది క్రీస్తుకు సాక్షులౌతారు - 1,8.

2. ఆత్మ దిగిరావడం

శిష్యుల మీదకు ఆత్మ దిగివచ్చినపుడు బలమైన గాలి వీచింది. నిప్ప నాలుకలు కనుపించాయి. సీనాయి పర్వతంమీద ప్రభువు దిగివచ్చి మోషేతో నిబంధనం చేసికున్నపుడు నిప్పలు గాలి కనుపించాయి - ద్వితీ 4,11-12. ఇక్కడ మల్లా దేవుడు ప్రజలతో మరో నిబంధనం చేసికుంటున్నాడు. ఇది క్రొత్త నిబంధనం. భగవంతుడు ప్రత్యక్షమయ్యేప్పడు గాలి, నిప్పలు, మబ్బులు కనుపించాయని చెప్పడం బైబుల్లోని ఓరచనా ప్రక్రియ. ఇక, యిక్కడ గాలి దేనికంటే, ఆత్మ పేరు హీబ్రూ భాషలో "రూవ్యా". ఈ రూవాః అనే శబ్దానికి గాలి అనే అర్థం. కనుక తన పేరునకు తగినట్లుగా ఆత్మ గాలిరూపంలో ప్రత్యక్షమైంది. ఇక నిప్ప నాలుకలు దేనికంటే, ప్రాచీన క్రైస్తవ సమాజంలో ఆత్మను పొందినవాళ్లంతా