పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ వరాన్ని పొందడానికి మన తరపున మనం తయారు కావచ్చు గూడ. దానికి మనం చేయవలసిన పనులివి.

1. ప్రభు గ్రంథాన్ని చక్కగా చదివి బైబులు వాక్యంతో పరిచయం కల్గించుకోవాలి. 2. ప్రభువు ప్రవచనం ద్వారా తన ప్రజల అక్కరలు తీర్చి వాళ్ళను ప్రోత్సాహపరుస్తాడని నమ్మాలి. 3. ప్రార్థనాభ్యాసం కలిగించుకొని అంతర్నివ్రాసియైన ప్రభువు మన అంతరాత్మలో మెల్లగా పలికే సందేశాన్ని వినడానికి అలవాటుపడాలి. 4. ప్రజల యెడల సానుభూతీ దయా అలవరచుకొని వాళ్ళ గోడు వినగలిగివుండాలి. ప్రవక్త బాధల్లో వున్న ప్రజలమీద గల ప్రేమచేత వాళ్ళకు ప్రభు సందేశాన్ని విన్పించాలిగాని, పదిమంది దృష్టి తనవైపు ఆకర్షించుకొని పేరు సంపాదించుకొందామనే స్వార్ణ ಬುದ್ದಿతో ప్రవచనం చెప్పగూడదు. అనగా ప్రవక్తకు ప్రధానాంశం దైవసందేశం చెప్పడం గాని, తాను పేరు తెచ్చుకోవడం కాదు.

5. ప్రవచనం చాల రకాలుగా వుంటుందని చెప్పాం. ఒకోమారు ఎవరైనా అతిముఖ్యమైన విషయాలను గూర్చి ప్రవచనం చెప్పవచ్చు. ఆలాంటప్పడు ఆ ప్రవచనాన్ని మనం ఎంతవరకు నమ్మాలి? అనగా ప్రవచనాన్ని పరిశీలించి చూచే పద్ధతి యేమిటి? - పౌలు "ప్రవచనాన్ని అనాదరం చేయకండి, కాని పరిశీలించిచూడండి" అని చెప్పాడు - 1తెస్తు 5,19-20. ఎవరైనా ప్రవచనం చెస్తే అక్కడివాళ్లు దాన్ని పరిశీలించి చూడ గలిగి వండాలి - 1కొ 14, 29. అనగా సమావేశంలో ఆ ప్రవచనం ఎవరికి వర్తిస్తుందో వాళ్ళ దాని నిజానిజాలు రుజువు చేయగలిగి వుండాలి.

ఇక, మామూలుగా ప్రవక్త చెప్పే సందేశాన్ని పరిశీలించి చూద్దానికి మూడంశాలు ఉపయోగ పడతాయి.

1) ప్రవక్త జీవితం యోగ్యంగా వుండాలి. వండును బట్టి చెటును నిర్ణయిస్తాంగదా? - లూకా 6,43. ప్రవక్త మంచి వాడైతే మంచిపనులు చేస్తుండాలి. పొట్టకూటి కోసమూ కీర్తికోసమూ ప్రవచనం చెప్పేవాణ్ణి నమ్మకూడదు.
2) భక్తులు చెప్పే సందేశం బైబులు సత్యాలకూ శ్రీసభ బోధలకూ వ్యతిరేకంగా పోదు. భగవంతుని కరుణాస్వభావానికి గూడ వ్యతిరేకంగా పోదు. కనుక శాపవచనాలు ప్రవచనం కానేరవు.

3) యథార్థమైన ప్రవచనంవల్ల ప్రోతల్లో ఆత్మఫలాలు పడతాయి. అనగా శ్రోతల హృదయం ప్రేమ, ఆనందం, సమాధానం, దయ మొదలైన భావాలు ఏర్పడతాయి - గల 5, 22.మంచి ప్రవక్త ప్రవచనం విన్నపుడు ప్రభువు స్వయంగానే ఆ సందేశం విన్పిస్తున్నాడు అన్నట్లుగా వుంటుంది. మన హృదయం eS సందేశాన్ని నమ్ముతుంది