పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందిస్తాడుగూడ. దీపంతో మరో దీపాన్ని వెలిగించినట్లుగా తన విశ్వాసంతో తోడి నరునికిగూడ విశ్వాసం పుట్టించి అతన్ని గూడ ప్రభువు వద్దకు తీసికొని వస్తాడు - రోమా 1, 12. కనుక ఆత్మను పొందాలి అంటే మన తరపున ఈ షరతులన్నీ నెరవేరాలి. దీన్నిబట్టి పెంతేకోస్తు ఉద్యమం చిత్తశుద్ధిలేనివాళ్ళకు ఎంతమాత్రమూ పనిచేయదని గుర్తించాలి.

12. ఆత్మనుపొందామనడానికి గురుతు ఏమిటి?

1. ఆత్మ తన్ను పొందిన వాళ్ళల్లో గొప్పమార్పు తెచ్చిపెడుతుందని చెప్పాం. శిష్యులు ఆత్మను పొందకముందు బలహీనులు, పిరికివాళ్ళు, జ్ఞానం లేనివాళ్లు, ఆసబోతులు. కాని ఆత్మ వచ్చాక ఈ దురుణాన్నీ సమసిపోయి గొప్ప ప్రేషితుల్యారు. ఈనాడు పెంతెకోస్తు ఉద్యమంలో జేరి ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందిన వాళ్ళల్లోగూడ ఈలాంటి మార్చే కన్పిస్తుంది. కొంతమందిలో ఈ మార్పు హఠాత్తుగా కన్పిస్తుంది. కొంతమందిలో నిదానంగా కన్పిస్తుంది. కాని మార్చేమో తధ్యం.

2. ఈ మార్పుకి కారణం? ఇది మానుషశక్తి వలన కలిగిన మార్పుకాదు. దైవశక్తివలన, అనగా పరిశుద్దాత్మ వలన కలిగిన మార్పు ఈ మార్పువలన భక్తుల్లో ఆనందమూ ఉత్సాహమూ గోచరిస్తుంది. స్వతంత్ర ప్రవర్తనం కన్పిస్తుంది. లోకం యెదుట ప్రభువుకి సాక్ష్యమీయాలనే కోరిక వెల్లడి ఔతుంది. కనుకనే పెంతెకోస్తు ఉద్యమంలో చేరినవాళ్ళు "మేము క్రొత్త జీవితం జీవిస్తున్నాం" అని చెప్తారు. మామూలుగా ఆత్మ దిగివచ్చినపుడు భక్తుని అంతరాత్మలో ఓ విధమైన అనుభూతి కలుగుతుంది. అతనిహృదయం పులకిస్తుంది. ఓ విధమైన సంతోషమూ సమాధానమూ గోచరిస్తాయి. ఐనా అందరిలోను ఈ యనుభూతి కలుగకపోవచ్చు.

3. ప్రోటెస్టెంటు పెంతెకోస్తు సభ్యులు ఆత్మను పొందామనడానికి ప్రధాన చిహ్నం భాషల్లో ప్రభువుని స్తుతించడం అని చెప్తారు. కాని క్యాతలిక్ పెంతెకోస్తు సభ్యులు ఈ భావాన్ని అంగీకరించరు. ఐనా క్యాతలిక్ సభ్యులకుకూడ తరచుగా భాషల్లో ప్రభుని స్తుతించడమనే వరం లభిస్తూనే వుంటుంది. ఇక క్యాతలిక్ సభ్యుల భావాల ప్రకారం, ఆత్మను పొందాము అనడానికి ప్రధాన చిహ్నం ప్రేమ. పరిశుద్దాత్మ గొప్ప ప్రేమశక్తి os యాత్మద్వారా దేవుని ప్రేమ మనహృదయంలోకి కుమ్మరింపబడుతుంది - రోమా -5, 5. కనుక మనం ఆత్మను పొందాము అనడానికి గురుతు ప్రేమ ఒక్కటే. అనగా మన హృదయంలో పూర్వంకంటె ఇప్పడు ప్రేమ ఎక్కువగా కన్పించాలి. ఈ ప్రేమ దైవప్రేమ సోదరప్రేమ అని రెండురకాలుగా వుంటుంది.