పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. ఆత్మద్వారా మన హృదయంలో ప్రేమ పెరిగినట్లయితే అది మన ఆలోచనల్లోను పనుల్లోను కన్పిస్తుంది. పండునుబట్టి చెట్టును నిర్ణయిస్తాంగదా! - లూకా 6, 43-45.

1) మొదట, మనకు ముగ్గురు దైవవ్యక్తుల పట్ల ప్రేమ పెరుగుతుంది. పితను సుతుణ్ణి ఆత్మను పూజించి ఆరాధిస్తాం. భక్తితో ప్రార్థన చేసికొంటాం. ప్రభువాక్యమైన బైబులు గ్రంథంపట్ల భక్తి ఆదరమూ వృద్ధిచెందుతుంది. సంస్కారాలపట్ల, విశేషంగా దివ్యసత్రసాదం పట్ల, భక్తి ఎక్కుమోతుంది.
2) తరువాత, నునకు తోడిజనంపట్లగూడ ప్రేమ పెరుగుతుంది. ఇతరుల యెడల రోషానికి మారుగా ప్రేమ చూపుతాం. అసహనానికి మారుగా దయ చూపెడతాం. వివాదానికి మారుగా గౌరవమర్యాదలు ప్రదర్శిస్తాం. సంకుచిత మనస్తత్వానికి మారుగా విశాల హృదయం అలవర్చుకొంటాం.
3) కడన మన జీవితంకూడ మారుతుంది. మన ఆశయాలూ కోరికలూ, విలువలూ మారిపోతాయి. భౌతిక వసువులకంటె ఆధ్యాత్మిక వస్తువులపట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతాం. స్వార్థంకంటె పరార్ధాన్ని ఎక్కువగా గణిస్తాం. మన బాధ్యతలను మనం సంతృప్తికరంగా నిర్వహిస్తాం.

మనం ప్రేషితులంగా మెలుగుతాం. ఇతరులకుగూడ ప్రభుని తెలియజేద్దాం అనే కోరిక పడుతుది. మనలో ఏదో దైవశక్తి పనిచేస్తూ క్రీస్తుకి సాక్ష్యమీయమని మనలను పురికొల్పినట్లుగా కన్పిస్తుంది. మన హృదయంలో శాంతీ ఆనందమూ సంతృప్తీ నెలకొంటాయి.

దైవప్రేమ సోదరప్రేమ అనే ఈ రెండు ఫలాలను బట్టి మనం ఆత్మను పొందామని నమ్మవచ్చు. కనుక ఆత్మ జీవిత మంటే ఎప్పటికప్పుడు మన పాపాలకు పశ్చాత్తాపపడి హృదయాన్ని శుద్ధి చేసికోవడం. ఆత్మద్వారా క్రీస్తుకి సన్నిహితంగా మెలుగుతూండడం. ప్రభువనీ తోడిజనాన్నీ ప్రేమ భావంతో సేవిస్తూండడం.

13. పరిశుద్దాత్మ వరాలు

1. దేవుడు నరులకిచ్చే ప్రధానవరం ప్రేమ. ఈ ప్రేమే పరిశుద్దాత్మ కనుక భగవంతుడు పరిశుద్దాత్మ ద్వారా మన హృదయాన్ని ప్రేమతో నింపుతాడు.

ఈ పరిశుద్దాత్మ మన జీవితంలో రెండు పనులు చేస్తుంది. మొదటిది, ఆ యాత్మ మనలను పవిత్రపరుస్తుంది. తండ్రి కోరుకొన్నట్లుగనే మనలను క్రీస్తు చెంతకు