పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అడుగుకోవాలి - ఫిలి 1, 21. ప్రభువుపట్ల యథార్థమైన ప్రేమ కలవారికిగాని ఈలాంటి భావాలు కలుగవు. చిత్తశుద్ధి కలవాళ్లు గాని ఆ ప్రభుని అంగీకరించి అతని భక్తులుగా జీవించలేరు.

4. మూడవది, పరిశుద్దాత్మను మన నాయకునిగా స్వీకరించాలి. అతని చెప్పుచేతల ప్రకారం జీవించాలి. ప్రభువు తన యాత్మను మనయందుంచి తన ఆజ్ఞలప్రకారం మనంజీవించేలా చేస్తాడు - యెహెజ్కేలు 36,27. దేవుని బిడ్డలను దేవునిఆత్మే నడిపిస్తుంది - రోమా 8,14. మనజీవితం ఆత్మే గనుక, ఆ యాత్మచేతనే మనం నడిపింపబడాలి - గల 5,25. మనకంటె ముందుగా ఆత్మక్రీస్తుని నడిపించింది. ఆలాగే ఈనాడు మనలను గూడ నడిపిస్తుంది. ఆ యాత్మ మన మనస్సులో వుండి మనకు వెలుగును ప్రసాదిస్తుంది. మంచి ఆలోచనలు పుట్టిస్తుంది. ఆ యాలోచనలను మనం ఆచరణలో పెట్టి వాటిప్రకారం జీవించేలా చేస్తుందిగూడ, ప్రాచీన క్రైస్తవులు ఆత్మను బిడ్డను నడిపించే తల్లితోను, పడవను నడిపించే తెరచాపతోను పోల్చారు. ఆత్మ రోజురోజు మనలను నడిపించుకొని పోతూనే వుంటుంది. ఎక్కడికి? క్రీస్తు వద్దకీ, తండ్రివద్దకీ.

కడన, మనకు దేవునియందు విశ్వాసం వుండాలి. మనం ఆ ప్రభువునుండి ఎంత పొందుతామని విశ్వసిస్తామో అంత మాత్రమే పొందుతాం. మన విశ్వాసానికి ఆధారం ప్రభువు చేసిన ప్రమాణమే. పరలోకంలోని తండ్రి తన్నడిగిన వాళ్ళకు తప్పకుండా పరిశుద్దాత్మ నిస్తాడు - లూకా 11,13. క్రీస్తుని విశ్వసించిన వాళ్ళకు అద్భుతశక్తులు లభిస్తాయి - మార్కు 16,17.

ఓమారు పదిమంది కుష్టరోగులు ప్రభుని ఆరోగ్యం ప్రసాదించమని అడిగారు. ప్రభువు వాళ్ళను దేవాలయంలోని యాజకుల వద్దకు వెళ్ళి కన్పించమని చెప్పాడు. ఆ పలుకులు నమ్మి వాళ్లు వెళ్లారు. ఆలా వెళూండగా ప్రభువు వాళ్ళకు త్రొవలో వ్యాధి నయమయ్యేలా చేసాడు. కనుక నరుల విశ్వాసమనేది దేవుని ప్రమాణానికీ, ఆ ప్రమాణాన్ని అతడు కార్య రూపేణ నెరవేర్చడానికి మధ్యలో వస్తుంది. పై ఉదాహరణంలో కుష్టరోగులు క్రీస్తు వాక్యాన్ని నమ్మియాజకుల వద్దకు వెళ్ళడం వాళ్ళ విశ్వాసం. వాళ్లు ఆలా వెళ్ళకముందు ప్రభువు ప్రమాణం చేసాడు, ఆలా వెళ్ళాక తన ప్రమాణాన్ని నిలబెట్టుకొన్నాడు. మనకుగూడ ప్రభువు పలుకులందు ఈలాంటి విశ్వాసముంటే, అతడు మనకుగూడ మేలికార్యాలు చేస్తాడు.

ప్రభువునందు విశ్వాసంగల భక్తుడు అతన్నిస్తుతించి కొనియాడతాడు. అతని ఉపకారాలను వేనోళ్ళ ఉగ్గడిస్తాడు. పైగా అతడు తన విశ్వాసాన్ని వేరేవాళ్ళకు