పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించిపెట్టవా అని వాళ్ళ ప్రశ్న క్రీస్తు వచ్చింది ఇందుకా? ఈ ప్రశ్ననుబట్టే మూడేండ్లతరువాత గూడవాళ్ళ క్రీస్తుని అట్టే అర్థంచేసికోలేదని రుజుతుంది గదా!

కాని ఓమారు ఆత్మ దిగివచ్చినంక వాళ్ళ బుద్ధులూ తలంపులూ పూర్తిగా మారిపోయాయి. ఇక వాళ్ళు రాజకీయాల గొడవ పట్టించుకోలేదు. క్రీస్తులోనికి జ్ఞానస్నానంపొంది పాపాలను పరిహారం చేసికోవాలి అని తలంచడం ప్రారంభించారు. అటుతోలే గాలి ఇటు తోలడం మొదలెట్టింది. అంతకుముందు పేత్రు మొదలైన శిష్యులు ఓ పనిపిల్లకు భయపడిపోయి క్రీస్తుని ఎరుగమని బొంకారు - మత్త 26, 69-70. క్రీస్తు ఉత్తానానంతరం గూడ వాళ్ళ యూదులకు భయపడి తలుపులు మూసివేసిన యింటిలో దాగుకొని వున్నారు - యోహా 20,19, ఇప్పడు అదే శిష్యులు యెరూషలేము వీధుల్లోకి వచ్చి బాహాటంగా ఆ క్రీస్తునిగూర్చి బోధించడం మొదలెట్టారు. మొదటిరోజుననే యెరూషలేము వీధుల్లోనే మూడువేల మందికి జ్ఞానస్నానం ఇచ్చారు – అచ 2,41. యూదుల న్యాయస్థానమైన సానే డ్రిన్ మహాసభ యెదుటికివెళ్ళి యేసు పేరుమీదుగా దప్పితే మరోపేరుమీదుగా రక్షణం లేదని బల్లగ్రుద్ది వాదించారు - అచ 4,12. పూర్వపు శిష్యులెక్కడ ఈ శిష్యులెక్కడ? వీళ్ళకు ఈ ధైర్యమూ ఈ శక్తి ఎక్కడనుండి వచ్చాయి? ఆత్మవలననేగదా? క్రీస్తుతో మూడేండ్ల జీవించినా వాళ్ళల్లో ఆ చైతన్యం పుట్టలేదు. ఇప్పడు ఆత్మ దిగివచ్చాక ఒక్కరోజులోనే ఇంత చైతన్యం కలిగింది. ఆత్మ కలిగించే మార్చు ఈలాంటిది - అచ 1,8.

3. ఆత్మ మన జీవితంలోగూడ గొప్ప మార్పు తెస్తుంది. ఆ యాత్మ క్రీస్తుబోధలను గైకొని మనకు మళ్లా బోధిస్తుంది - యోహా 16,14. క్రీస్తుని మనకు తెలియజెప్పంది. ఆ ప్రభువు గ్రంథాన్ని చదువుకొని అర్థంచేసికొనేలా చేస్తుంది. ఆ ప్రభువు సంస్కారాలను భక్తితో స్వీకరించేలా చేస్తుంది. దైవప్రేమనూ సోదరప్రేమనూ మన హృదయంలో కుమ్మరిస్తుంది. మనం తోడి ప్రజలకుగూడ క్రీస్తుని చాటిచెప్పేలా చేస్తుంది. ఈ క్రియలద్వారా మనం పూర్తిగా మారిపోతాం, మనం వెలుపలికి పూర్వక్రైస్తవులమే. మన హృదయంమాత్రం మారిపోతుంది. ఇంతకు ముందు అనుభవానికిరాని క్రైస్తవ జీవితం జీవిస్తుంటాం. ఇప్పుడు క్రైస్తవ సత్యాలు అనుభవానికి వస్తాయి. ఇంతకుముందు భక్తిలేని క్రైస్తవ జీవితం గడుపుతుంటాం, ఇప్పడు మన హృదయం భక్తిపారవశ్యంతో నిండిపోతుంది. గ్రుడ్డివాడు చూపు పొందితే ఏలా వుంటుందో ఆత్మను పొందిన మన జీవితంకూడ ఆలా వుంటుంది.

పెంతెకోస్తు ఉద్యమంలో చేరినవాళ్ళల్లో చాలమందిలో ఈ మార్పు గోచరిస్తుంది, వాళ్ళ హృదయం క్రొత్తదనం పొందుతుంది. వాళ్ళ భావాలు క్రొత్తమోతాయి. ఆత్మ కొనివచ్చే ఈ మార్పును మనంకూడ అభిలషించాలి.