పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొనసాగిస్తుంది. మనలను క్రీస్తు చెంతకు చేరదీస్తుంది. ఈలా ఆత్మద్వారా క్రీస్తుని చేరడం ఈ వుద్యమంలోని ముఖ్యాంశం.

2. ఆత్మ నడిపించిన క్రీస్తు

1. పూర్వవేదంలో ప్రవక్తలు రాబోయే మెస్సీయా ఆత్మతో నిండివుంటాడని చెప్పారు. దేవుని ఆత్మ అతనికి జ్ఞానమూ వివేకమూ ప్రసాదిస్తుంది - యెష 11,2. ప్రభువు అతన్ని తన ఆత్మతో నింపుతాడు. ఆయాత్మను పొంది అతడు ప్రతిజాతికీ న్యాయం తీరుస్తాడు - 42,1. ప్రభువు మెస్సీయాను తనఆత్మతో నింపుతాడు. పేదలకు సువార్తను బోధించడానికీ, శ్రమపడే వాళ్ల బాధలను తొలగించడానికీ, బందీలకూ చెరలోవున్నవాళ్ళకూ విడుదలను ప్రకటించటానికీ ప్రభువు అతన్ని పంపుతాడు - 61,1. ఈలా పూర్వవేదం మెస్సీయా ఆత్మతో నిండివుంటాడని చెప్తుంది.

2. రక్షణకాలం ఆసన్నంకాగా పరిశుద్దాత్మశక్తి వలన మెస్సీయా మానవరూపం చేకొన్నాడు. పరిశుద్దాత్మ మరియ అనే కన్యపై దిగివచ్చింది. సర్వోన్నతునిశక్తి ఆమెను క్రమ్ముకొంది. ఆమె గర్భం ధరించి బిడ్డను కంది. ఆత్మశక్తివలన పుట్టిన ఆ బిడ్డడే క్రీస్తు — లూకా 1,35.

3. క్రీస్తు జ్ఞానస్నానం పొందుతూండగా ఆత్మ పావురంలాగ అతని మీదికి దిగివచ్చింది - లూకా 3,22. తండ్రి అతన్ని పవిత్రాత్మతోను శక్తితోను అభిషేకించాడు అచ 10,38. ఆశక్తితోనే క్రీస్తు బహిరంగ జీవితాన్ని ప్రారంభించాడు.

4. జ్ఞానస్నానానంతరం ఆత్మ క్రీస్తుని ఎడారికి కొనిపోయింది. అక్కడ అతడు నలువదినాళ్లు ప్రార్థనల్లో గడిపాడు. ఆత్మ బలంతో ప్రభువు ఎడారిలో పిశాచాన్ని ఎదిరించాడు, గెలిచాడు - మత్త 4,1.ఆత్మశక్తితోనే దయ్యాలను వెళ్ళగొట్టాడు - 12,28 (లూకా 11,20) బలవంతుడైన పిశాచాన్ని బంధించి వాని యిలు కొల్లగొట్టిన మహాబలవంతుడు ప్రభువు - మార్కు 3,27.

5. ఈ యాత్మ బలంతోనే క్రీస్తు సువార్తను ప్రకటించాడు - లూకా 4, 1415. వ్యాధిగ్రస్టులకు ఆరోగ్యం ప్రసాదించాడు, -5, 17, ప్రభువు బహిరంగజీవితమంతా ఆత్మప్రేరణంతోనే కొనసాగిపోయింది. ఈకాలంలో ఆత్మ అతన్ని ఆనందంతో నింపింది. ఆ యానందంతో అతడు తండ్రిని కొనియాడాడు - 10,21.

6. ఆత్మ సహాయంతోనే క్రీస్తు చివరి శత్రువైన పిశాచాన్ని జయించి ఉత్తానుడయ్యాడు - 1 కొరి. 15, 45. అనగా ఉత్తాన క్రీస్తు తాను పొందిన ఆత్మను