పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనకూ ప్రసాదిస్తాడు. ఆయాత్మద్వారా మనకు జీవం కలుగుతుంది. క్రీస్తు యిచ్చే ఆత్మద్వారానే మరణానంతరం మనంకూడ ఉత్తానమౌతాం - రోమా 8,11.

7. ఉత్తానక్రీస్తు ఆత్మ ఒకరితో ఒకరు కలిసివుంటారు - 2కొ 3,17. క్రీస్తు ఉన్నకాడ అతని ఆత్మకూడ వుంటుంది. అసలు ఇపుడు సమాజంలో క్రీస్తుని ప్రత్యక్తంచేసేది ఆత్మే ఆత్మ ద్వారానే క్రీస్తు ఈనాడు మన నడుమ నెలకొని వున్నాడు – మత్త 28, 20.

8. మొదటి పెంతెకోస్తునాడు క్రీస్తు శిష్యులమీదికి ఆత్మను పంపాడు. అప్పటినుండి ప్రభువు తన్ను నమ్మినవాళ్ళకు ఆత్మ నిస్తూనే వున్నాడు - అచ 2,38. ఈనాడు మనకు కూడ తన ఆత్మను ప్రసాదిస్తాడు. ఇవి విశేషంగా ఆత్మ ଔର୍ଣ୍ଣ ప్రజలకు ప్రబోధం కలిగించే రోజులు. ఇక, క్రీస్తుమనకు ఆత్మనిచ్చినట్లే ఆత్మ మల్లా మనకు క్రీస్తు నిస్తుంది. ఆ యాత్మ అనుగ్రహంవల్లనే మనం క్రీస్తుని విశ్వసింపగల్లుతూన్నాం. - 1కొ 12,3.

3. ప్రభువు మనలను ప్రేమించేవాడు

1. ప్రభువు నన్నెందుకు ప్రేమించాలి? నావల్ల అతని కేమిలాభం? నన్ను ప్రేమించకపోతే అతనికేమి నష్టం? భగవంతుడు నరులను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలిసికోవాలి అంటే, ఆ నరుల వైపుగాదు భగవంతునివైపే చూడాలి. ప్రేమించడం భగవంతుని స్వభావం, దేవుడు ప్రేమస్వరూపుడు -1 యోహా 4,8. కనుక అతడు నరులను ప్రేమించకుండా వుండలేడు. ఆ ప్రభువు ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించదుగూడ, మన నుండి అతడు ఏమి ఆశిస్తాడు గనుక? ఇక, అతని ప్రేమవలన మనకు లాభం కలుగుతుంది. అతని ప్రేమను పొందడంవల్ల మనం ప్రేమింపదగినవాళ్ల మౌతాం. కనుకనే అగస్టీను భక్తుడు "ఓ ప్రభూ! నీవునన్ను ప్రేమించావు కనుకనే నేను ప్రేమింప దగినవాణ్ణి అయ్యాను" అని పల్కాడు.

2. తండ్రి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి దాన్ని రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాడు - యోహా 3, 16. కనుక ప్రభువు మనలను ఉన్నవాళ్లను ఉన్నట్టుగా అంగీకరిస్తాడు, ప్రేమిస్తాడుగూడ. మనమంటే అతనికి ఎంతో ఆదరం, అతడు మననుండి కోరుకొనేదల్లా మనం అతని ప్రేమకు అదుచెప్పకుండా వుండాలనే. చాలామంది భగవంతుడు తమ్మ ప్రేమిస్తున్నాడని నమ్మనేనమ్మరు. వాళ్లు మానవుల ప్రేమకు నోచుకోలేక భగవంతుని ప్రేమను మాత్రం ఏలా పొందగలమని శంకిస్తూంటారు. కాని ఇది పొరపాటు, “నీ బాధలన్నీ ప్రభువుకి వదలివేయి, అతడు నిన్ను కాపాడతాడు” అంటుంది కీర్తన 55,