పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రైస్తవ ప్రజలను ప్రబోధించే తీరునుగూర్చి చాల విషయాలు బోధించింది.క్యాతలిక్ సమాజంలో పవిత్రాత్మ ఉద్యమం 1967లో అమెరికాలో ప్రారంభమైంది. 1970లో ఇండియాకు వచ్చింది. నేడు బొంబాయి, బెంగుళూరు, పోట్టా, హైద్రాబాదులాంటి పట్టణాల్లో ఈ వుద్యమం బాగా ప్రచారంలోవుంది. వాటికన్ సభ ముగిసాక మన క్యాతలిక్ సమాజంలో కన్పించే చైతన్యవంతమైన ఉద్యమాల్లో మొదట చెప్పకోతగ్గది ఇదే! ప్రస్తుతం దీనిలో చాలమంది క్యాతలిక్ క్రైస్తవులు సభ్యులుగా వుంటున్నారు.

4. ఈ వుద్యమం త్వరితగతిని ప్రచారంలోకి వచ్చింది. ఇందుకు కారణాలు చాలా వున్నాయి. 1 ఇది దేవుని కార్యం, విశేషంగా పరిశుద్దాత్మ పని. 2.దీనిలో భగవదనుభవం ప్రధానం, ప్రార్ధనద్వారా భక్తులు భగవంతుణ్ణి అనుభవానికి తెచ్చుకొంటారు. 3 ఈ వుద్యమం మన ప్రాచీన Sš సంప్రదాయాలకు వ్యతిరేకంగా పోదు, అందువల్ల ఎవరూ దీన్ని నిరోధించడంలేదు. 4. దీనిలో బైబులు పఠనమూ బైబులు ప్రార్థనా ఎక్కువగా వుంటాయి. పైగా ఈ భక్తివిధానంలో ఓ విధమైన ఆనందమూ మాధుర్యమూ కూడ గోచరిస్తాయి. మంచి పాటలు పాడతారు. 5 పోపుగారూ మేత్రాణులూ ఈ వుద్యమాన్ని ప్రశంసించి ప్రోత్సహిస్తూ వచ్చారు.

5. పవిత్రాత్మ ఉద్యమంలోని ప్రధానాంశం ఏమిటి? ఆత్మ ద్వారా క్రీస్తుని అనుభవానికి తెచ్చుకోవడం. ఈ వుద్యమం క్రీస్తు ఈనాడు మన నడుమ వసిస్తున్నాడని చెప్తుంది. ప్రభు సందేశమైన బైబులు గ్రంథాన్ని భక్తితో చదవాలని బోధిస్తుంది. ఆత్మవరాలు విశ్వాసులందరికీ లభిస్తాయని వెల్లడిచేస్తుంది. కనుక ఈ వుద్యమం అన్ని విధాలా యోగ్యమైంది.

ఒక్క విషయం.పవిత్రాత్మ ఉద్యమం అంటే కేవలం పరిశుద్దాత్మ పట్ల భక్తిని చూపేది మాత్రమేకాదు.ఆలాంటి భక్తి మార్గాలు పూర్వంనుండే చాలా వున్నాయి.మరి,ఆత్మద్వారా క్రీస్తుని చేరడం దీనిలోని ముఖ్యాంశం.ఆత్మ వచ్చిందిగూడ మనలను తనవైపు ఆకర్షించుకోవడం కోసంగాదు, క్రీస్తు చెంతకు చేర్చడంకోసం. బైబులుసంప్రదాయం ప్రకారం మొదటి నాయకుడు వెళ్ళిపోతూ రెండవ నాయకుణ్ణి నియమిస్తాడు. ఈ రెండవ నాయకుడు మొదటి నాయకుని పనిని కొనసాగిస్తాడు. మోషేదాటిపోతూ యోషువాను యిప్రాయేలు ప్రజకు నాయకునిగా నియమించాడు. ఇతడు ఆ ప్రజను వాగ్రత్త భూమికి చేర్చాడు.ఏలీయా దాటిపోతే ఎలీషాను ప్రవక్తగా నియమించాడు. ఇతడు గురువుగారి ప్రవచనోద్యమాన్ని కొనసాగించాడు.ఈలాగే క్రీస్తు వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మను రెండవ ఆదరణకర్తగా నియమించాడు. క్రీస్తు తర్వాత వచ్చిన ఈ యాత్మ క్రీస్తు రక్షణకార్యాన్ని