పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశ్నలు

అధ్యాయం -1

1."బైబులు మనుష్యావతారాన్ని ఓ జ్యోతినిగా చిత్రిస్తుంది" - వివరించండి.
2.మన రక్షణం మనుష్యావతారంనుండే ప్రారంభమైంది - వివరించండి.
3.మనుష్యావతారం నూత్న నిబంధనం లాంటిది - వివరించండి.
4.మనుష్యావతారం భావాన్ని గూర్చి చెప్పిన అంశాల్లో ఏ మూడింటినైన సవిస్తరంగా వివరించండి.
5.మన భక్తికృత్యాల్లో క్రీస్తుని దేవుణ్ణిగానేగాని నరుజ్జీగా భావించకపోవడం పెద్ద పొరపాటని చెప్పాం. ఎందుకు?
6.మనుష్యావతార విషయంలో గ్రీకు ల్యాటిను తిరుసభలకున్న వ్యత్యాసమేమిటి?
7.నేడు క్రిస్మసు పండుగ సందర్భంలో మన ప్రజలు ప్రదర్శించే భక్తిలో మీకు నచ్చిన అంశాలను కొన్నిటిని పేర్కొనండి.

అధ్యాయం - 2

1.యోహాను జ్ఞానస్నానానికీ, క్రీస్తు జ్ఞానస్నానానికీ తేడా యేమిటి?
2."ఇతడు నా ప్రియకుమారుడు" అని క్రీస్తు తరపున తండ్రి పలికిన సాక్ష్యం భావం ఏమిటి?
3.పవిత్రాత్మ క్రీస్తమీదికి పావురం రూపంలో దిగిరావడంలో భావం ఏమిటి?
4.క్రీస్తు జ్ఞానస్నానం అతని మరణోత్థానాలను ఏలా సూచిస్తుంది?
5.యేసు, క్రీస్తు అనే పేరుల అర్థం వివరించండి.
6.క్రీస్తు స్వీకరించిన మూడభిషేకాలను వివరించండి

అధ్యాయం - 3

1.కొండమీద తండ్రి క్రీస్తునిగూర్చి పల్కిన సాక్ష్యంలోని మూడంశాలను వివరించండి.
2.క్రీస్తు దివ్యరూపధారణ భావం ఏమిటి?
3.మన పుణ్యక్షేత్రాల్లో మన క్రైస్తవ భక్తులు భగవంతుణ్ణి అనుభవానికి తెచ్చుకొనే తీరును మీకు తెలిసినంతవరకు వివరించండి.