పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం - 4

1.“యిప్రాయేలు సంప్రదాయం ప్రకారం ఎడారి దేవుణ్ణి కలసికొనేతావు, శోధనలకు గురయ్యే తావకూడ" - వివరించండి.
2.భోజనప్రీతి, దేవుణ్ణి పరీక్షకు గురిచేయడం, విగ్రహారాధనం అనే మూడు క్రీస్తు శోధనల్లో ఒక్కదాన్ని సవిస్తరంగా వివరించండి.
3.క్రీస్తు ఏకైక శోధన ఏమిటి?
4.శోధనల్లో మన స్వాతంత్ర్యం నశించదు - వివరించండి
5.మన శోధనల్లో క్రీస్తు విజయం మనమీద ఏలా సోకుతుందో తెలియజేయండి.

అధ్యాయం - 5

1.యేసు శ్రుతికర్త అనే భావాన్ని నూతవేద రచయిత లందరికంటె గూడ యోహాను ఎక్కువగా పేర్కొన్నాడు – వివరించండి.
2.క్రీస్తు తండ్రిని తెలియజేయడాన్ని గూర్చి ఇరెనేయుస్ సూచించిన భావాలను పేర్కొనండి.
3.నరుడైన క్రీస్తు దేవుడైన తండ్రిని మనకు ఏలా తెలియజేస్తాడు?
4."నా ద్వారానేగాని ఎవడైనా తండ్రివద్దకు రాలేడు” అనే వాక్యం భావాన్నిగాని, లేదా "నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే" అనే వాక్యం భావాన్ని కాని వివరించండి - యోహా 14,6-9.

అధ్యాయం - 6

1.విధేయాత్మకమూ ప్రేమపూరితమూ ఐన క్రీస్తు మరణం మనలను రక్షించింది - వివరించండి.
2.క్రీస్తు సిలువ మరణంవరకు విధేయుడయ్యాడు" అనడంలో పౌలు భావం ఏమిటి? - ఫిలి 2,8.
3.క్రీస్తు పాతాళానికి దిగడంలో ఉద్దేశం ఏమిటి?
4.క్రీస్తు చిందించిన నెత్తురు మన పాపాలకు ఏలా ప్రాయశ్చిత్తం చేసిందో వివరించండి.
5.క్రీస్తు మరణంద్వారా మనకు దేవునితో రాజీ యేలా కుదిరింది?
6.క్రీస్తు శ్రమలనుభవించి మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా? ఈ వాక్యం నేడు మన జీవితానికి ఏలా వర్తిస్తుందో తెలియజేయండి - లూకా 24,26.