పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

9. ఆత్మ ప్రదానం

ఉత్థానక్రీస్తు మనకు ఆత్మను దయచేస్తాడు. ఆయాత్మ తన తరపున తాను మనకు క్రీస్తుని దయచేస్తుంది. మనలను నిరంతరమూ క్రీస్తు చెంతకు నడిపించుకొని పోతూంటుంది. నేడు మనం ఆత్మద్వారా తప్పితే క్రీస్తుని చేరలేం. ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.

1. పెంతెకోసు

పెంతెకోస్తు మొదట యూదుల పండుగ. పాస్కపండుగ ముగిసాక 50 దినాలకు వాళ్లు ఈ పండుగ జరుపుకొనేవాళ్ళు. గ్రీకులో పెంతెకోస్తు అంటే యాభైయని అర్థం ఈ పండుగకే వారాల పండుగ అనికూడ పేరు. ఇది తొలిరోజుల్లో వ్యవసాయోత్సవంగా వుండేది. ఈ దినాన యూదులు దేవునికి తొలివెన్నులు కానుకగా అర్పించేవాళ్ళు - నిర్ణ 34,22. క్రమేణ ఇది సీనాయి నిబంధనాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనే పండుగగా మారిపోయింది. క్రీస్తు శిష్యులు యెరూషలేములో ఈ పండుగ జరుపుకొంటూండగా ఆత్మవాళ్ళమీదికి దిగివచ్చింది. అప్పటినుండి అది క్రైస్తవుల పెంతెకోస్తుగా మారింది.

పెంతెకోస్తు దినాన ఆత్మ గాలి, నిప్ప, నాలుకల రూపాల్లో శిష్యులమీదికి దిగివచ్చింది. ఇవన్నీ సంకేతాలు. కనుక వాటి భావాన్ని అర్థంచేసికోవాలి. 1. ఆత్మకు హీబ్రూ భాషలో "రువా" అని పేరు. ఈ మాటకు గాలి, ఊపిరి అని అర్థం, సర్వప్రాణులకూ ఊపిరినిచ్చేది ఆత్మ తాను ప్రాణశక్తినని సూచిస్తూ ఇక్కడ ఆత్మ గాలిరూపంలో దిగివచ్చింది. 2. అగ్ని బైబుల్లో దైవ సాక్షాత్కారానికి గుర్తుగా వుంటుంది. మోషే సీనాయికొండమీదికి వెళ్ళినపుడు పొగల్లో మంటల్లో దేవుడతనికి దర్శనమిచ్చాడు. నిర్ణ 19, 18-20. ఇక్కడ ఈ దిగివచ్చిన ఆత్మడు దేవుడు అని సూచింపబడింది. 3. నాలుక వాక్ష్మక్తిని సూచిస్తుంది. శిష్యులు ఆత్మనుండి వాకుక్తిని పొందుతారు. ఆ శక్తితోనే తర్వాత క్రీస్తుని బోధిస్తారు.

దేవుడు అంత్యదినాల్లో మానవులందరిమీదా తన ఆత్మను కుమ్మరిస్తాడని యోవేలు పూర్వవేదంలో ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరి ఆత్మ దిగివచ్చిందని పేత్రు యెరూషలేమున తన తొలి ప్రసంగంలో పేర్కొన్నాడు - అచ 2,17.

పెంతెకోస్తుతో క్రీస్తు పాస్క సంఘటనం ముగుస్తుంది. అతడు చనిపోయి, ఉత్తానుడై, తండ్రి కుడిపార్యాన్ని చేరుకొని పితనుండి ఆత్మను పొంది, తాను పొందిన ఆత్మను శిష్యులమీద కుమ్మరించాడు - అచ 2,33. కనుక పెంతెకోస్తుతో ప్రభువు ఉత్థానం పరిపూర్ణమైందని చెప్పాలి. ఈ వదంతంతో ఉత్థానక్రీస్తు రక్షణం వస్తుతః ప్రారంభమౌతుంది. ఈ సంఘటనతోనే తిరుసభకూడ ప్రారంభమౌతుంది. క్రీస్తు తిరుసభమీదికి తన ఆత్మను