పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎక్కిపోవడమంటే అతని ఉత్యానమూ మోక్షారోహణమూను. ప్రభువు మోక్షారోహణాన్ని భక్తిభావంతో విశ్వసించే భాగ్యం కొరకు అడుగుకొందాం.

2.క్రీస్తు మోక్షానికివెళ్ళి తండ్రి ప్రక్కన ఆసీనుడయ్యాడు - అచ 5,31. క్రీస్తు జీవిత సంఘటనలు మన జీవితంలోకూడ నెరవేరతాయి. కనుక మనంకూడ అతనితోపాటు మోక్షారోపణంచేసి తండ్రి కుడిపార్వాసన ఆసీనులమౌతాం. ఇక్కడ "ఆసీనులు కావడం" అంటే రాజ్యపాలనం చేయడం. కనుక క్రీస్తుతోపాటు మనంకూడ రాజ్యపాలనం చేస్తాం. కనుకనే పౌలు "దేవుడు క్రీస్తుతోపాటు మనకు కూడ దివ్యలోక పరిపాలనాధికారం అనుగ్రహించాడు" అని చెప్పాడు - ఎఫె 26. ఈ భాగ్యం మనకు లోకాంతంలో సిద్ధిస్తుంది. కాని అది సిద్ధించడం మాత్రం ఖాయం. శిర సున్నకాడనే అవయవాలుకూడ వుండాలికదా! కావున క్రీస్తు ఉన్నచోటికే మనంకూడ చేరుకొంటాం. పురాతన చిత్రకారులు క్రీస్తు కర్ణధారియై తిరుసభ అనే నావను మోక్షానికి నడిపిస్తున్నట్లుగా చిత్రించారు. అనగా ఆ ప్రభువు తన భక్తులమైన మనలనుకూడ తానున్నచోటికి కొనిపోతాడని భావం. ఈ భాగ్యానికిగాను మనమెంతైనా సంతోషించాలి.

3.ప్రభువు మోక్షారోహణం చేశాడంటే మనలను విడనాడి వెళ్ళిపోలేదు. అతడు మనల నేనాడూ అనాథులను జేయడు. కనుక అతడు మన ఆశాచిహ్నంగా పరలోకానికి వెళ్ళాడు. అతడు తిరుసభకు అధిపతి. జ్ఞానశరీరానికి శిరస్సు. అనగా మనలనందరినీ తనలో ఇముడ్చుకొన్నవాడు. కనుక అతడు తానున్నకాడికే మనలనుకూడ తీసికొని వెత్తాడు. మన రోజు వచ్చినపుడు మనంకూడ అతని మహిమలో పాలుపొందుతాం.

4.మన తరపున మనం శారీరకంగా ఈ లోకంలో వసిసూన్నా మానసికంగా పరలోకంలో జీవించాలి. మనకు ఈ లోకంలో స్థిరమైన పట్టణమేమీ లేదు. మనం రాబోయే పట్టణంకోసం - అనగా మోక్షం కోసం - ఎదురుచూస్తుండాలి. హెబ్రే 13,14. మనం ఇహలోకానికి చెందిన వాళ్ళంకాదు, పరలోక పౌరులమని గుర్తించాలి - ఫిలి 3,20, భక్తితో అడుగుకొంటేచాలు మోక్షారోహణమూర్తియైన ప్రభువు మనకు ఈ భాగ్యాన్ని దయచేస్తాడు. ఈ మంటి మీద వసించే నరుడు తన హృదయాన్ని పరలోకంవైపు త్రిప్పకోవడమే ఓ గొప్ప భాగ్యమని చెప్పాలి.