పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంపాడు. ఆ యాత్మ ఇక తిరుసభను నడిపిస్తుంది. క్రీస్తును తిరుసభకు ప్రత్యక్షం చేస్తుంది. క్రీస్తు ఆత్మద్వారా తిరుసభ సభ్యులను పవిత్రపరుస్తూపోతాడు. విశేషంగా దేవద్రవ్యాను మానాలద్వారా ఈ కార్యం జరుగుతుంది.

పూర్వం మోషే సీనాయి కొండమీద దేవుని నుండి ధర్మశాస్త్రం పొందాడు. ఇప్పడు పెంతెకోస్తునుండి నూత్న ధర్మశాస్త్రం ప్రారంభమౌతుంది. ఆ పదాజ్ఞలకు బదులుగా ఇక్కడ ప్రేమాజ్ఞ ప్రాముఖ్యంలోకి వస్తుంది. యిర్మీయా పేర్కొన్న నూత్ననిబంధనం ఈ సంఘటనంతో ప్రారంభమౌతుంది – 31,83.

2. ఉత్తానక్రీస్తు మనకు ఆత్మను దయచేస్తాడు

క్రీస్తు తాను తండ్రిని చేరుకొని అతని చెంతనుండి ఆత్మను పంపిస్తానని శిష్యులతో చెప్పాడు - యోహా 14,16. తాను వెత్తేనేగాని ఆ యాదరణకర్త రాడని పల్కాడు - 167. ఆ యాత్మడు వచ్చి తనకు సాక్ష్యమిస్తాడని నుడివాడు - 15,26. అనగా పరిశుద్దాత్మడు శిష్యుల హృదయాల్లో క్రీస్తుని సమర్ధిస్తూ మాట్లాడుతాడు.

ఇంకా ప్రభువు "దప్పికగొన్నవాడు నా వద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవచ్చు. నన్ను విశ్వసించేవాడి అంతరంగంలో నుండి జీవజల ప్రవాహం పొంగిపారుతుంది" అన్నాడ. ఈ ప్రవాహం ఏమోకాదు, పరిశుద్ధాత్మే. ఈ యాత్మ క్రీస్తునుండి బయలుదేరి భక్తుని హృదయంలోకి ప్రవేశిస్తుంది. కాని పై వాక్యం చెప్పేప్పటికి యేసే యింకా ఉత్తానంకాలేదు. కనుక అతడే ఇంకా తండ్రినుండి ఆత్మను పొందలేదు. అతడు మొదట తాను ఆత్మను పొందిన పిదపగాని ఆ యాత్మను శిష్యులమీద కుమ్మరించడు - 7, 37-39.

యోహాను 7,39 క్రీస్తు ఉత్తానం కాకముందు ఆత్మను పొందలేదని చెప్పంది. కాని మత్తయి లూకా సువార్తలు అతడు పట్టువునుండే ఆత్మతో నిండివున్నట్లుగా వర్ణిస్తాయి. ఈ విరుద్ధ భావాలను సమన్వయం చేయడం ఏలా? యోహాను ఆలోచన ప్రకారం క్రీస్తులోని ఆత్మ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఆత్మ క్రీస్తులోనే వుండి అతన్ని నడిపించడం ఒక విధానం. ఈ పద్ధతిలో ఆత్మ మొదటినుండీ క్రీస్తులో వుంది. మత్తయి లూకా పేర్కొంది ఈ విధానాన్నే యోహాను మాత్రం ఈ విధానాన్ని పేర్కొనలేదు. ఇక, ఆత్మ క్రీస్తునుండి మనలోనికి వేంచేసి మనలనుకూడ నడిపించడం రెండవ విధానం. ఈ పద్ధతిలో ఆత్మ మొదటి నుండీ క్రీస్తులో లేదు. అతడు ఉత్థానమైనంక మాత్రమే అతని ఆత్మ మనలోనికి ప్రవేశిస్తుంది. పై యోహాను 7,39 వచనం ఈ రెండవ విధానాన్ని పేర్కొంటుంది.

ఉత్తాన క్రీస్తుతండ్రి కుడిపార్యాన్ని చేరుకొని అతని నుండి తాను ఆత్మను పొందాడు. ఆలా తాను పొందిన ఆత్మను తర్వాత శిష్యులమీద కుమ్మరించాడు. అదే