పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుకిచ్చి అతన్ని సత్కరించాడు. సమస్త ప్రాణులూ ఇకమీదట ఆ ఉత్థాన ప్రభువు ముందట మోకాలు వంచాలి -ఫిలి 2,6-11. ఇకమీదట మనకు ఆ ప్రభువు ద్వారా తప్ప మరియొక వ్యక్తిద్వారా రక్షణం సిద్ధించదు - అచ 4, 12. అది క్రీస్తు మహిమ.

ఇక, క్రీస్తు మహిమ అతన్ని విశ్వసించే భక్తులకు కూడ సంక్రమిస్తుంది. మానవజాతి కంతటికీ ప్రధమఫలమో అన్నట్లు క్రీస్తు ఉత్తానమై మహిమను పొందాడు - 1కొ 15,20. మోక్లారోహణం చేసాడు. యూదులు దేవాలయంలో అర్పించిన ప్రధమఫలాలు పంటనంతటినీ సూచిస్తాయి. అలాగే క్రీస్తు ఉత్తానం మానవజాతి ఉత్థానాన్నంతటినీ సూచిస్తుంది. కనుక అతని ఉత్తానమూ మోక్షారోహణమూ మనకుకూడ సంక్రమిస్తాయి. మనంకూడ అతని మహిమలో పాలు పొందుతాం.

ఒక్క నరులు మాత్రమేకాదు భౌతిక సృష్టికూడ మోక్షారోహణ క్రీస్తువలన మహిమను పొందుతుంది. ఈ మహిమ కోసమే సృష్టి అంతా కాచుకొనివుంది - రోమా 8, 22. క్రీస్తు మనుష్యావతార మెత్తినపుడు మన భౌతిక శరీరాన్ని స్వీకరించాడుగదా? అందువలన ఈ భౌతిక ప్రపంచం కూడ అతని శరీరంలో భాగమైంది. ఇప్పడు మోక్షంలో మహిమను పొందిన అతని ఉత్థాన శరీరం ఓనాడు ఈ భౌతిక ప్రపంచానికికూడ మహిమను చేకూర్చి పెడుతుంది. కాని అది ఎప్పడు జరుగుతుందో, ఏలా జరుగుతుందో మనకు తెలియదు.

ప్రభువు "నేను భూమిమీదినుండి పైకెత్తబడితే అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొంటాను" అన్నాడు - యోహా 12,32. మోక్షంలోని ప్రభువు మనలనందరినీ తన చెంతకు ఆకర్షిస్తాడు. మనలనుకూడ ఆ తండ్రి కుడిపార్యాన కూర్చోబెడతాడు. అదే క్రీస్తు వలన మనం పొందే మహిమ. ఇంకా ప్రభువు "నా తండ్రి గృహంలో అనేక నివాస స్థలాలున్నాయి. నేను వెళ్ళి మీకుకూడ ఓ నివాసం సిద్ధం చేస్తాను. నేను మళ్ళా వచ్చి మిమ్మ అక్కడికి తీసుకొని వెత్తాను" అని చెప్పాడు - యోహా 142-3. ఆ నివాసస్థలం మోక్షమే. అనగా మోక్షం చేరుకొన్నపుడు మన మహిమ సంపూర్ణమౌతుంది.

ప్రార్థనా భావాలు

1. క్రీస్తు నికొదేమతో మాట్లాడుతూ "పరలోకం నుండి దిగివచ్చిన మనుష్యకుమారుడు తప్ప ఎవడూ పరలోకానికి ఎక్కిపోలేడు” అని చెప్పాడు - యోహా 3,13. ఈ వాక్యంలో పరలోకం నుండి దిగిరావడమంటే క్రీస్తు మనుష్యావతారం. పరలోకానికి