పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. ఆత్మను పొందిన క్రీస్తు

మొదటి ఆదాము జీవించే ప్రాణి అయ్యాడు. కాని కడపటి ఆదాము జీవమిచ్చే ప్రాణి అయ్యాడు అని వ్రాసాడు పౌలు -1కొరి 15,45, సృష్ట్యాదిలో దేవుడు మట్టిముద్దలోనికి శ్వాస ఊదగా అది జీవించే ప్రాణి ఐంది. అతడే ఆదాము - ఆది 2,7. అతడు ప్రాకృతిక మానవుడు. తనకుతాను జీవించినవాడు. ఇతనిద్వారానే మనకు ప్రాకృతిక జీవం లభించింది. ప్రభువు మళ్ళాపిడికెడు మట్టిముద్దలోనికి, అనగా మృతదేహంలోనికి, శ్వాస ఊదాడు. ఈ మృత దేహానికి గూడ జీవం లభించింది. అతడే ఉత్థానక్రీస్తు. కాని తొలి ఆదాములాగ ఈ కడపటి ఆదాము కేవలం తనకుతాను జీవించే ప్రాణి కాలేదు. మనకు జీవమిచ్చే ప్రాణి అయ్యాడు. అక్కడ దేవుడు రెండుసారులు ఊదిన శ్వాస పరిశుద్ధాత్మే ఆ యాత్మద్వారానే తొలి ఆదాము రెండవ ఆదాము ఐన మృతక్రీస్తూ సజీవులయ్యారు. అనగా ఉత్తాన సమయంలో క్రీస్తు ఆత్మతో నిండిపోయాడు. అలా తాను పొందిన ఆత్మనే అతడు మనమీద కుమ్మరిస్తాడు.

ఇక్కడ ఇద్దరు ఆదాములకూ వున్న వ్యత్యాసాన్ని గుర్తించాలి. తొలి ఆదాము తనకుతాను జీవించాడు. తన భౌతిక జీవాన్ని మనకుకూడ అందించాడు. కాని ఉత్థానక్రీస్తు తనకుతాను జీవించడం మాత్రమేకాదు. మనకుకూడ జీవమిచ్చేవాడు అయ్యాడు. అతడిచ్చే జీవం భౌతికమైంది కాదు, ఆధ్యాత్మికమైంది. అనగా వరప్రసాద సంబంధమైంది. ಇದೆ పరిశుద్ధాత్మ అనగా ఉత్తానక్రీస్తు స్వయంగా ఆత్మను పొంది తాను పొందిన ఆత్మను మనకుకూడ దయచేస్తాడు. ప్రభువే ఆత్మ అని వ్రాసాడు పౌలు - 2 కొ 3,17. ఇక్కడ క్రీస్తు ఆత్మ ఐపోయాడని భావంకాదు. ఆత్మతో పూర్ణంగా నిండిపోయాడని అర్థం. లైూన నింపుకొనిన ఆ యాత్మనే అతడు మనకుకూడ ప్రసాదిస్తాడు.

యోహాను కూడ క్రీస్తు ఆత్మతో నిండిపోతాడనీ, అలా నిండిపోయిన ఆత్మను మనకూ ప్రసాదిస్తాడనీ చెప్పాడు. "దప్పికగొన్నవాడు నాయొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవచ్చు నన్ను విశ్వసించేవాని అంతరంగంలోనుండి జీవజల ప్రవాహం పొంగిపారుతుంది అన్నాడు ప్రభువు. అతడు తన్ను విశ్వసించేవాళ్ళ పొందబోయే ఆత్మనుగూర్చి ఈలా చెప్పాడు" - 7,38-39. ఇక్కడ జీవజల ప్రవాహం అంటే పరిశుద్దాత్మే ఈ యాత్మ క్రీస్తు హృదయంలోనుండి భక్తుని అంతరంగంలోకి పారుతుది అనగా ఉత్తానక్రీస్తు మనకు ఆత్మనిస్తాడని భావం. క్రీస్తు ఉత్తానమయ్యాడు అంటే ప్రప్రథమంగా అతడు ఆత్మను