పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొందాడనే భావం, ఉత్థానానికిముందు అతడు దాసునిరూపంతాల్చిన సేవకుడు. కాని ఇప్పడు మహిమను పొందిన ప్రభువు = ఫిలి 2,7,

3. క్రీస్తు ఉత్తానం మన ఉత్తానంకూడ

"క్రీస్తుని మరణంనుండి లేవనెత్తిన దేవుని యాత్మే కనుక మీలో వున్నట్లయితే, క్రీస్తుని మృతులలోనుండి లేవనెత్తినవాడు మీలోవున్న తన ఆత్మద్వారా మీ మృతదేహాలకు కూడా జీవం దయచేస్తాడు" - రోమా 8,11. తండ్రి క్రీస్తు మృతదేహాన్ని ఆత్మద్వారా లేపాడు. అదే ఆత్మ మనలో కూడా వుంది. కనుక తండ్రి ఆత్మద్వారా క్రీస్తుని లేపినట్లే మనలనూ లేపుతాడు. క్రీస్తు ఆత్మ మనలోవుండి మన దేహాన్ని ఉత్తానానికి సిద్ధం చేస్తూవుంటుంది - రోమా 8,23. ఈ రీతిగా క్రీస్తు ఉత్తానం మనమీద సోకి మనకు కూడ ఉత్థానాన్ని సాధించిపెడుతుంది. మనం అతని జ్ఞానదేహ మౌతాంగదా!

ఇంకా ఉత్థానక్రీస్తు దేహంకూడ మనకు ఉత్తానాన్ని ఆర్థించి పెడుతుంది. అదే దివ్యసత్రసాదం, ఈ దివ్యసత్రసాదం మనలను అంతిమ దినాన లేపుతుంది - యోహా 6,54.

విశ్వాస సంగ్రహంలో శరీరం ఉత్తానాన్ని విశ్వసిస్తున్నాను అని చెప్తాం. మన మానవజాతికి శిరస్సు ప్రతినిధీ ఐన క్రీస్తు ఈవరకే ఉత్తానమయ్యాడు. అతని ప్రభావం వలన మనంకూడ ఓనాడు ఉత్థానమౌతాం. ప్రభువు తల్లి ఈ వరకే ఉత్తాపన భాగ్యానికి నోచుకొంది. మనకు ఆ శుభదినం ఇంకా రాలేదు. కాని ఆ పునీతమాత మనకు ఆదర్శంగా వుంటుంది. ఆమెనులాగే మనలనుకూడ ప్రభువు జీవంతో లేపుతాడు.

4 ఉత్థాన జీవితపు బాధ్యతలు

1. ఉత్థాన జీవితం నైతికమైన బాధ్యతలను తెచ్చిపెడుతుంది. "మీరు క్రీస్తుతోపాటు సజీవులుగా లేవనెత్తబడ్డారు. కనుక మీ హృదయాలను పరలోకంలోని వస్తువులవైపు మరల్చండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిప్రక్కన సింహాసనం మీద ఆసీనుడై వున్నాడు. కనుక మీరు మీ మనస్సులను ఈ భూమిమీది వస్తువులమీద కాక అక్కడ పరలోక్షంలోని వస్తువులమీద లగ్నం చేసికొనండి" అన్నాడు పౌలు - కొలో 3,1–2. మనం ఉత్థానక్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందుతాం. అప్పటినుండి అతని ఉత్తానం మనమీద