పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పెడుతుంది. ఈలా అతని మరణోత్థానాలు రెండూ మన రక్షణకు తోడ్పడతాయి. మరణం పాప నిర్మూలనాన్నీ ఉత్తానం వరప్రసాదాన్నీ దయచేస్తాయి. ఈ భావాన్నే పౌలు "మన పాపాలకు అతడు మరణానికి అప్పగింపబడ్డాడు. మనలను నీతిమంతులనుగా చేయడానికి అతడు మరల లేపబడ్డాడు" అని చెప్పాడు - రోమా 4,25. ఈ భావాన్నే లూకా కూడ "క్రీస్తు శ్రమలనుభవించిన పిదప మహిమలో ప్రవేశింపవలసి వుంది" అనే వాక్యంలో పేర్కొన్నాడు - 24,26.

ఇప్పడు క్రైస్తవ ప్రపంచానికి క్రిస్మసు పెద్ద పండుగయింది. కాని తొలిశతాబ్దంలో క్రిస్మసుకంటె ఉత్తానం పెద్దపండుగ. అనగా క్రీస్తు ఉత్తానం క్రైస్తవులకు ప్రధాన సంఘటన మన్నమాట. ఇప్పడు జ్ఞానస్నానం దివ్యసత్ర్పసాదం పాపసంకీర్తనం మొదలైన సంస్కారాలన్నిటిలోను పనిచేసేది ఉత్తానక్రీస్తే మనకు వరప్రసాదం లభించేది అతనినుండే శ్రీసభకు అధిపతి అతడే మనం మోక్షంలో చేరుకొనేది గూడ అతని సన్నిధినే. ఆలాంటి ఉత్థాన క్రీస్తుని క్రైస్తవ భక్తుడు అనుభవానికి తెచ్చుకోవాలి.

ఇక్కడ ఇంకో విషయంకూడ చెప్పాలి. వేదగ్రంథం క్రీస్తు మూడవరోజు జీవంతో లేచాడని చెప్తుంది - 1కొ 15,4. ఇది కేవలం మనుష్యుల కర్ణమయ్యేరీతిలో చెప్పిన వాక్యం, క్రీస్తు శరీరం భూమిలో క్రుళ్ళిపోలేదని, అతడు మళ్ళా సజీవుడై లేచాడనీ మాత్రమే ఈ వాక్యం భావం. యథార్థంగా జరిగిందేమిటంటే, క్రీస్తు మరణించినప్పడే ఉత్థానమయ్యాడు. అతని మరణానికీ, ఉత్థానానికీ మధ్య వ్యవధియేమీలేదు. అతని మరణమే అతని ఉత్థానoకూడా.

క్రీస్తు మరణమూ ఉత్థానమూ వస్తుతః ఒకే సంఘటనం. కాలరీత్యా మాత్రం దాన్ని రెండు సంఘటనలుగా జెప్పారు. అనగా అతని మరణానికీ వుత్తానానికీ మధ్య వ్యవధి వున్నట్లుగా వర్ణించారు. დgeჯი వర్ణించకపోతే క్రీస్తు మనకు నిజంగా మరణించినట్లుగా కన్పించడు. అతని మరణం నిజమైందిగా చూపట్టదు. మన కన్నులు ఆ మరణాన్ని చూడలేదు కనుక మనం దాన్ని నమ్మం, కావున మనకు నమ్మకం కలగడంకోసం వేదగ్రంథం క్రీస్తు మరడోత్థానాలను వేరువేరు సంఘటనలనుగా పేర్కొంటుంది. వస్తుతః మాత్రం అవి ఒకే సంఘటనం. అతని మరణమూ ఉత్తానమూ ఏకకాలంలో జరిగిపోయాయి.