పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞప్తికి తెస్తుంది. అనగా క్రీస్తు ఉత్తానం లేక నిర్గమనం, యూదుల నిర్గమనం లాంటిదన్నమాట.

ఇక, అతడు వంటరిగా తండ్రివద్దకు వెళ్ళిపోడు. మన ప్రతినిధిగా, మనలను తనతో కలుపుకొనే, తండ్రివద్దకు వెళ్లాడు. అతడు ముందుగా మన కొరకు పరలోకంలో ఓ నివాసస్థలం సిద్ధంచేస్తాడు - 14,8. తాను వున్నచోటనే మనంకూడ వుండాలని అతని కోరిక -17.24 ఈలా యోహాను క్రీస్తువత్థానాన్ని నూత్ననిర్గమనంగా భావించాడు.

క్రీస్తు ద్వారా మనంకూడ తండ్రి చెంతకు తిరిగిపోతాం. ప్రభువు ఉత్తానాన్ని వర్ణిస్తూ పౌలు "మరణంలో నిద్రించే వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృత్యువునుండి లేవనెత్తబడ్డాడు" అన్నాడు – 1కొ 15,20. ఈ వాక్యం భావమిది. యూదులు ప్రథమ ఫలాల పండుగనాడు పొలంలో పండిన మొదటి వెన్నులను దేవళంలో అర్పించేవాళ్లు, ఈ వెన్నులు పండిన పంటనంతా సూచిస్తాయి. పిడికెడు వెన్నులద్వారా పండిన పంటంతా దేవునికే అర్పింపబడిందని సూచింపబడింది, ఉత్థానుడైన క్రీస్తుకూడ మానవజాతిలో మొదటి వెన్నులాంటివాడు. అతని ఉత్థానం మానవులమైన మనందరి ఉత్తానాన్ని సూచిస్తుంది. మానవజాతికి ప్రతినిధియైన క్రీస్తు ద్వారా మనమందరమూ ఓనాడు తండ్రి గృహాన్ని చేరుకొంటాం.

మనం ఈ క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందుతాం. అతన్ని విశ్వసించి అతనితో ఐక్యమౌతాం. కనుక అతనితో పాటు మనమూ ఉత్తానమై అతని వెనువెంట తండ్రి ఇంటిలో అడుగుపెడతాం. ఈ ఉత్తానదశ మనకు ఈ జీవితంలోనే పాక్షికంగా సిద్ధిస్తుంది. చనిపోయాక ఆ దశ మనకు పూర్తిగా లభిస్తుంది.

మనం మామూలుగా క్రీస్తు మనలను తన మరణం ద్వారా మాత్రమే రక్షించాడు అనుకొంటాం. ఇది పొరపాటు,

అతడు మనలను తన ఉత్తానంద్వారా గూడ రక్షించాడు. క్రీస్తు మరణంద్వారా మనకు పాపపరిహారం జరుగుతుంది. అతని ఉత్తానంద్వారా మనకు వరప్రసాదం లభిస్తుంది, ఈ పాపపరిహారమూ ఈ వరప్రసాదమూ - ఇవి రెండూ కలిసే రక్షణం. క్రీస్తు మరణితానాలు రెండూ కలసే మనలను రక్షిస్తాయి. మన పాపం మన రక్షణానికి అవరోధంగా వుంటుంది, క్రీస్తు మరణం ఈ యవరోధాన్ని నిర్మూలిస్తుంది. ఓమారు ఈ యవరోధం తొలగిపోయాక ఇక మనకు రక్షణం కలుగుతుంది. క్రీస్తు ఉత్థానం మనకు నూత్న జీవాన్ని వరప్రసాదాన్నీ దయచేసి ఈ రక్షణాన్ని సంపాదించి